Home » ఘ‌నంగా అలీ కూతురు ఎంగేజ్‌మెంట్‌.. పెళ్లి కొడుకు ఎవ‌రంటే..?

ఘ‌నంగా అలీ కూతురు ఎంగేజ్‌మెంట్‌.. పెళ్లి కొడుకు ఎవ‌రంటే..?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ క‌మెడీయ‌న్‌ల‌లో ఒక‌రైన అలీ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న బాల‌న‌టుడిగా మెరిసి వంద‌లాది సినిమాల్లో న‌టించి అంద‌రినీ మెప్పించారు. అలీ క్యారెక్ట‌ర్ ఆర్టీస్ట్ గా, క‌మెడీయ‌న్‌గా, హీరోగా అన్ని పాత్ర‌ల్లో క‌లిపి దాదాపు 1100కి పైగా సినిమాల్లోన‌టించి చ‌రిత్ర సృష్టించారు. ఇక ఈ మ‌ధ్య కాలంలో సినిమాల్లో త‌క్కువ‌గానే న‌టిస్తున్నారు అలీ. ఇటీవ‌లే విడుద‌లైన లైగ‌ర్ సినిమాలో న‌టించారు అలీ. సినిమాల కంటే ఎక్కువ‌గా బుల్లితెర‌పై హోస్ట్‌గా, కొన్ని షోల‌లో జ‌డ్జీగా చేస్తూ అల‌రిస్తున్నాడు. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో కూడా న‌టించారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలో అన్న‌గారు ఎన్టీఆర్ కు రాజేంద్ర‌ప్ర‌సాద్ డ‌బ్బింగ్ చెప్పారన్న సంగ‌తి తెలుసా..? ఆ సినిమా ఏదంటే..?

Advertisement

అలీ భార్య పేరు జుబేదా అలీ కాగా.. వీరికి ముగ్గురు సంతానం క‌ల‌రు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వారి పేర్లు ఫాతిమా ర‌మిజున్‌, మ‌హ‌హ్మ‌ద్ భాష‌, జుబేరియా. ఇక పెద్ద కుమార్తె ఫాతిమా ర‌మిజున్‌ ఈమ‌ధ్య కాలంలోనే డాక్ట‌ర్ ప‌ట్టా పొందింది. అలీకి అకాడ‌మీ ఆఫ్ యూనివ‌ర్స‌ల్ పీస్ వారు గౌర‌వ డాక్ట‌రేట్ కూడా ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. ఇక అలీ త‌న తండ్రి మ‌హ‌హ్మ‌ద్ భాష పేరుతో ఓ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ను ఏర్పాటు చేసిన ఎన్నో స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. అలీ స‌తీమ‌ణి జుబేదా అలీ గురించి సోష‌ల్ మీడియాలో ఫాలో అయ్యేవారికి ప్ర‌త్యేకించి ప‌రిచ‌య‌మే అవ‌స‌రం లేదు. ఈమె యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా వంటల వీడియోలు, హోం టూర్లు, స్పెష‌ల్ వీడియోలు అని అభిమానుల‌కు ద‌గ్గ‌ర అయింది. ఈమె ఛాన‌ల్ కి దాదాపు 5ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉండ‌డం విశేషం.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  అర్జున్‌రెడ్డి డిలీట్ సీన్ చూశారా..? ఆ డైలాగ్స్ వింటే పిచ్చేక్కాల్సిందే..!

తాజాగా అలీ పెద్ద కూతురు నిశ్చితార్థం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కి సాయికుమార్, బ్ర‌హ్మ‌నందం త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు విచ్చేసి ఆశీర్వ‌దించారు. జుబేదా అలీ ఈ వేడ‌క‌కు సంబంధించిన వీడియోని త‌న యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ఆమె ఈ వీడియోలో అంద‌రినీ ప‌రిచ‌యం చేస్తూ సాగే వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ముస్లిం సంప్ర‌దాయం ప్ర‌కారం.. అలీ కూతురు ఎంగేజ్‌మెంట్ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇక ఫాతిమాకి కాబోయే వ‌రుడు డాక్ట‌ర్ అనే తెలుస్తోంది. అంతేకాదు.. అలీ వియ్యంకుల ఇంట్లో వారంద‌రూ డాక్ట‌ర్లు అని జుబేద త‌న వీడియోలో అంద‌రినీ ప‌రిచ‌యం చేస్తూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  “సీతాకోక‌చిలుక” హీరో కెరీర్ నాశ‌నం అవ్వ‌డానికి కార‌ణం ఎవ‌రు..? టాలీవుడ్ కు ఎందుకు దూర‌మయ్యాడంటే..!

Visitors Are Also Reading