Home » మెగాస్టార్ బోళా శంకర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా ? 

మెగాస్టార్ బోళా శంకర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా ? 

by Anji
Ad

వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ లో ఉన్నారు. ఇదే ఊపులో తరువాత సినిమా భోళాశంకర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు చిరంజీవి. తమిళంలో అజిత్ హీరోగా రూపొందించిన వేదాళం చిత్రానికి  దర్శకుడు మెహర్ రమేష్. తమన్నా కథానాయిక కాగా.. చిరంజీవికి చెల్లిలి పాత్రల్లో కీర్తి సురేష్ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకొస్తుందని అభిమానులు భావించారు. తాజాగా రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ప్రకటించారు మేకర్స్. 

Also Read :  దారుణం ఆ ఓపెన్ ప్లేస్ లోనే కాలకృత్యాలు తీర్చుకున్న హీరోయిన్.. కారణం..?

Advertisement

చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న మెగా మూవీ బోళాశంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుందని వెల్లడించారు. ఉగాది పండుగ పురస్కరించుకొని మేకర్స్ ఈ మెగా అప్ డేట్ ఇచ్చారు. అంతేకాదు.. అనౌన్స్ మెంట్ పోస్టర్ చిరంజీవి గ్రీన్ కుర్తాలో హ్యాండ్సమ్ గా కనిపించారు. రాయల్ చెయిర్ లో చెరో వైపు కూర్చొన్న కీర్తి సురేష్, తమన్నా సంప్రదాయ దుస్తుల్లో బ్యూటిపుల్ గా దర్శనమిచ్చారు.  

Advertisement

Also Read :  ముస‌లిహీరోల‌కు అయితే ఇస్తారా..? రాజ‌మౌళి పై అర్జున్ రెడ్డి బామ్మ ఫైర్..!

Bholaa Shankar: Makers To Announce A Major Update On Chirajveevi's Next

ఈ చిత్రం ప్రమోషన్  కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ లభించగా.. అక్కినే యంగ్ హీరో సుశాంత్ సైతం ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించారు. బహుషా తను కీర్తి సురేష్ ని ప్రేమించే వ్యక్తిగా కనిపించే అవకాశముంది.  క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యాన్సర్ పై రూపొందుతున్న చిత్రానికి రామబ్రహ్మం,అనిల్ సుంకర నిర్మాతలు. తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తుండగా.. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రగతి, తులసి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, శ్రీముఖి, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులునటిస్తున్నారు. 

Also Read :  అవకాశం కోసం పక్కలోకి రమ్మన్నారు – శ్రీముఖి

Visitors Are Also Reading