Home » ముస‌లిహీరోల‌కు అయితే ఇస్తారా..? రాజ‌మౌళి పై అర్జున్ రెడ్డి బామ్మ ఫైర్..!

ముస‌లిహీరోల‌కు అయితే ఇస్తారా..? రాజ‌మౌళి పై అర్జున్ రెడ్డి బామ్మ ఫైర్..!

by AJAY
Ad

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా రానించిన వారిలో కాంచ‌న కూడా ఒక‌రు. కాంచ‌న అప్ప‌ట్లో స్టార్ హీరోల‌కు జోడీగా సినిమాలు చేసింది. తెలుగుతో పాటూ త‌మిళ మ‌ల‌యాళ సినిమాల‌లోనూ న‌టించి అభిమానుల‌ను సంపాదించుకుంది. హీరోయిన్ పాత్ర‌ల‌కు గుడ్ బై చెప్పిన త‌ర‌వాత కాంచ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా అవ‌తారం ఎత్తింది. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన అర్జున్ రెడ్డి సినిమాలో విజ‌య్ కి బామ్మ పాత్ర‌లో న‌టించి మెప్పించింది.

ALSO READ : రెండో పెళ్లికి సిద్ధమైన నటి ప్రగతి…మంచి క్యాష్ పార్టీనే పట్టిందంటూ ?

Advertisement

ఇదిలా ఉంటే కాంచ‌న తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు విష‌యాలను వెల్ల‌డించింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న‌ను అవ‌మానించాడు అంటూ కాంచ‌న వ్యాక్యానించింది. బాహుబ‌లి సినిమా కోసం రాజ‌మౌళి త‌న‌ను సంప్ర‌దించార‌ని కాంచ‌న వెల్ల‌డించింది. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం త‌న‌ను అడిగార‌ని చెప్పింది. దాంతో త‌ను రూ.5 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్టు వెల్ల‌డించింది.

Advertisement

కానీ రాజ‌మౌళి నా పాత్ర‌కు అంత ఇవ్వ‌లేన‌ని చెప్పార‌ని తెలిపింది. అంతే కాకుండా 5 ల‌క్ష‌లు త‌న‌కు పెద్ద అమౌంట్ కాద‌ని త‌న‌లాంటి వాళ్ల‌కు ఇస్తే సేవలు చేసుకుంటాము క‌దా అంటూ వ్యాక్యానించింది. రాజ‌మౌళి లాంటి పెద్ద డైర‌క్ట‌ర్ కు అది లెక్క‌కాదు…నాకు కూడా అది పెద్ద విష‌యం కాదు.

కానీ నాలాంటి వాళ్ల‌కు ఇస్తే అది ఎంతోమందికి ఉపయోగ‌ప‌డుతుంది క‌దా. అదే ముస‌లి హీరోల‌కు అయితే ఇస్తారా..? నేను విమ‌ర్శించ‌డం లేదు కానీ ఆర్టిస్ట్ ల క‌ష్టాలు ఎలా ఉంటాయో చెబుతున్నా. అంటూ కాంచ‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇక ప్ర‌స్తుతం సీనియ‌ర్ న‌టి చేసిన కామెంట్ లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ALSO READ : Kota Srinivasa Rao : కోటను కూడా చంపే**రు కదరా..! పాపం ఇదెక్కడి ఖర్మరా బాబు!

Visitors Are Also Reading