Home » బాల‌కృష్ణ‌తో ఆ హీరోయిన్ సినిమా వ‌దులుకోవ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

బాల‌కృష్ణ‌తో ఆ హీరోయిన్ సినిమా వ‌దులుకోవ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

by Anji
Published: Last Updated on
Ad

సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌రువాత ఎవ‌రైనా పెద్ద హీరోల‌తో అవ‌కాశం వ‌స్తే బాగుండు అనుకుంటారు. పెద్ద హీరోల‌తో అవ‌కాశం వ‌స్తే వారి లైఫ్ ట‌ర్న్ అవుతుంద‌ని చాలా మంది ఆశ‌ప‌డుతుంటారు. అలా అవ‌కాశం వ‌చ్చిన ఎవ్వ‌రూ కూడా వ‌దులుకోరు. కానీ ఓ హీరోయిన్ వ‌దులుకుంది. భీమ‌వ‌రం బుల్లోడు సినిమా హీరోయిన్ ఎస్తేర్ ఏకంగా నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుంద‌ట‌.

Advertisement

ఆమె తొలి సినిమానే తేజ ద‌ర్శ‌క‌త్వంలో చేసింది. ఆ త‌రువాత ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సినిమా అవ‌కాశాన్ని అందుకుంది. అయితే ఈ అమ్ముడు సినిమాల్లో న‌టించాల‌ని అస‌లు హైద‌రాబాద్ కు రాలేద‌ట‌. వేరే ప‌ని మీద హైద‌రాబాద్ వ‌స్తే అనుకోకుండా సినిమా అవ‌కాశాలు రావ‌డంతో ఇక్క‌డే ఉండి సినిమాల్లో న‌టించింద‌ట‌. భీమ‌వ‌రం బుల్లోడు సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే బాల‌య్య‌బాబుతో సినిమా అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. అలా చాలా ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ చ‌దువును మ‌ధ్య‌లో ఆపేసి సినిమాల్లో ఉండిపోవ‌డం ఇష్టంలేక సినిమా ఆఫ‌ర్స్‌ను వ‌దులుకుంది. చ‌దువు పూర్త‌యిన త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లోకి రావాల‌నుకుంద‌ట‌.

Advertisement

అయితే గోవా పోర్చుగీస్ కుటుంబానికి చెందిన ఈ ఎస్తేర్ క‌ర్ణాట‌క‌లోని ఉడిపిలో స్థిర‌ప‌డ్డారు. కొంక‌ణి, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో సినిమాల్లో హీరోయిన్ గా న‌టించింది ఎస్తేర్‌. ఇక చ‌దువు పూర్త‌యిన త‌రువాత ప్ర‌స్తుతం తెలుగులో న‌టిస్తోంది. ఈ మ‌ధ్య 69 సంస్కార్ కాల‌నీ సినిమా ద్వారా మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. రొటిన్ క‌థ‌ల‌తో కాకుండా భిన్నంగా ఉన్న సినిమాల్లో న‌టించాల‌నుకుంటుంద‌ట‌. ఈమె తెలుగు రాప‌ర్, సింగ‌ర్ నోయ‌ల్‌ను 2019లో పెళ్లి చేసుకుంది. అదే సంవ‌త్స‌రం వీరు విడిపోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : హిట్ కాంబినేషన్ వెంకటేష్-సౌందర్య ఇద్దరి కలయికలో ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా ? వాటిలో ఎన్ని హిట్ ?

ఒక‌ప్ప‌టి హీరోయిన్ సంఘ‌వి ఆ ద‌ర్శ‌కుడిని పెళ్లి చేసుకుని విడిపోయిన విష‌యం మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading