Home » హిట్ కాంబినేషన్ వెంకటేష్-సౌందర్య ఇద్దరి కలయికలో ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా ? వాటిలో ఎన్ని హిట్ ?

హిట్ కాంబినేషన్ వెంకటేష్-సౌందర్య ఇద్దరి కలయికలో ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా ? వాటిలో ఎన్ని హిట్ ?

by AJAY
Ad

అందాల తార సౌంద‌ర్య భౌతికంగా దూర‌మైనా ఆమె చేసిన పాత్ర‌ల ద్వారా మాత్రం ఎప్పుడూ ప్రేక్ష‌కుల మ‌దిలోనే ఉంటారు. సౌంద‌ర్య ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. టాలీవుడ్ లోని అప్ప‌టి స్టార్ హీరోలు అంద‌రి స‌ర‌స‌న న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్నారు. స్టార్ హీరోయిన్ గా సౌంద‌ర్య రాణించారు. ఇక సౌంద‌ర్య చాలా మంది హీరోల ప‌క్క‌న న‌టించినా కూడా వెంక‌టేష్ సౌంద‌ర్య కాంబినేష‌న్ కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉండేది.

 

Advertisement

వెంక‌టేష్ సౌంద‌ర్య కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. వెంక‌టేష్ సౌంద‌ర్య కాంబినేష‌న్ లో వ‌చ్చిన ప‌విత్ర‌బంధం సినిమా ఆరు భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్ వ‌చ్చిన మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా పెళ్లి చేసుకుందాం రా…ఈ సినిమా కూడా ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చి సూప‌ర్ హిట్ ను అందుకుంది.

Advertisement

ప‌ది కేంద్రాల‌లో ఈ సినిమా వంద రోజులు ఆడింది. సౌందర్య వెంక‌టేష్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన మ‌రో సినిమా జ‌యం మ‌న‌దేరా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను సొంతం చేసుకుంది. అదే విధంగా వీరిద్ద‌రి పెయిర్ కు ఎక్కువ మంది అభిమానులు అయిన సినిమా రాజా. ఈ సినిమా త‌ర‌వాత వెంక‌టేష్ సౌంద‌ర్య పెయిర్ కి క్రేజ్ మ‌రింత పెరిగింది.

సౌంద‌ర్య వెంక‌టేష్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన దేవి పుత్రుడు సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా త‌ర‌వాత సౌంద‌ర్య వెంక‌టేష్ లో కాంబినేషన్ కు కూడా బ్రేక్ ప‌డింది. అంతే కాకుండా వెంక‌టేష్ హీరోగా న‌టించిన సూప‌ర్ పోలీస్ సినిమాలో సౌంద‌ర్య సెకండ్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది.

Visitors Are Also Reading