Home » ఒక‌ప్ప‌టి హీరోయిన్ సంఘ‌వి ఆ ద‌ర్శ‌కుడిని పెళ్లి చేసుకుని విడిపోయిన విష‌యం మీకు తెలుసా..?

ఒక‌ప్ప‌టి హీరోయిన్ సంఘ‌వి ఆ ద‌ర్శ‌కుడిని పెళ్లి చేసుకుని విడిపోయిన విష‌యం మీకు తెలుసా..?

by Anji

సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖ‌ హీరో, హీరోయిన్లు అయితే ఎప్పుడు ఎవ‌రినీ పెళ్లి చేసుకుంటారో చెప్ప‌డం క‌ష్టం. కొంత మంది హీరోయిన్లు ద‌ర్శ‌కుల‌ను, మ‌రికొంత మంది హీరోల‌ను, బిజినెస్ మెన్‌, సాప్ట్‌వేర్ ఇలా వారు వీరు అని తేడా లేకుండా ఎవ‌రికీ న‌చ్చిన‌వారిని వారు పెళ్లి చేసుకుంటారు. ఇక ప్ర‌స్తుత త‌రుణంలో పెళ్లి చేసుకున్న త‌రువాత వారు ఎన్ని రోజులు క‌లిసి ఉంటార‌నేది మాత్రం చెప్ప‌లేని ప‌రిస్థితి. కొద్ది రోజులు క‌లిసి ఉన్న త‌రువాత సినీ సెల‌బ్రెటీలు త‌మ బంధానికి గుడ్ బై చెప్పి విడిపోతుంటారు. ఇందుకు ప‌లు కార‌ణాలున్నాయి. విబేధాల కార‌ణంగా కొంత‌మంది విడిపోతే.. మ‌రికొంద‌రూ విడిపోకుండానే ఉండి ఎవ‌రి దారినా వారుంటున్నారు.

ముఖ్యంగా షూటింగ్‌ల‌తో బిజీగా ఉండే సెల‌బ్రెటీలు త‌మ జీవిత భాగ‌స్వామితో మాట్లాడే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఏమైనా ఇబ్బందులు వ‌చ్చిన‌ప్పుడు ఒక‌రికొక‌రు అర్థం చేసుకుని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి స‌మ‌య‌మే ఉండ‌దు. ఇలా కొంత మంది సెల‌బ్రెటీలు అయితే విడాకులు తీసుకుని మ‌రొక పెళ్లి కూడా చేసుకుంటూ ఉంటారు. కొంత మంది అయితే ఏకంగా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇదే బాట‌లో ఓ స్టార్ హీరోయిన్ ఓ స్టార్ డైరెక్ట‌ర్‌ను పెళ్లి చేసుకుని కొద్ది రోజుల‌కే విడిపోయింది. ఆమె మ‌రెవ్వ‌రో కాదు ఒక‌ప్ప‌టి స్టార్‌ హీరోయిన్ సంఘ‌వి.

 


తాజ్‌మ‌హ‌ల్ సినిమాతో తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. ముఖ్యంగా వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన సూర్య‌వంశం సినిమాతో ఆమె ప్ర‌త్యేక గుర్తింపు పొందింది. దాదాపు 23 సంవ‌త్స‌రాల పాటు హీరోయిన్‌గా కొన‌సాగిన సంఘ‌వి తెలుగులో టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. 1998లో శివ‌య్య సినిమాలో న‌టించేట‌ప్పుడు అప్ప‌టి స్టార్ ద‌ర్శ‌కుడు సురేష్ శ‌ర్మ‌ను సంఘ‌వి ప్రేమ వివాహం చేసుకుంది.అయితే వీరి పెళ్లి బంధం మాత్రం ఎన్ని రోజులు నిల‌వ‌లేదు. విభేదాల కార‌ణంగా ద‌ర్శుడు సురేష్ వ‌ర్మ‌తో విడిపోయింది సంఘ‌వి. ఆ త‌రువాత బెంగ‌ళూరుకి చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్‌ను సంఘ‌వి పెళ్లి చేసుకుంది. 42 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఓ ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది సంఘ‌వి. అయితే సంఘ‌వి చిన్న‌ప్పుడు వారి త‌ల్లిదండ్రులు ఆమెను డాక్ట‌ర్ చేయాల‌ని కోరిక ఉండేద‌ట‌. ఆమె డ్యాన్స్ మాస్ట‌ర్ వ‌ద్ద డ్యాన్స్ నేర్చుకోవ‌డంతో ఆ డ్యాన్స్ చూసి ద‌ర్శ‌కుడు సెల్వ సినిమాల్లో న‌టించే అవకాశం ఇచ్చార‌ట‌.

Also Read : 

రాజ‌మౌళి మ‌గ‌ధీర సినిమాకి నో చెప్పి త‌ప్పు చేశానంటున్న న‌టి అర్చ‌న‌..!

జ‌బ‌ర్ద‌స్త్‌కు అన‌సూయ గుడ్ బై.. వైర‌ల్ అవుతున్న కామెంట్స్‌..!

 

Visitors Are Also Reading