Home » నిఖిల్ ‘స్పై’ నుంచి రిలీజ్ అయిన ‘ఆజాది’ సాంగ్ కి అర్థం ఏంటో తెలుసా ?

నిఖిల్ ‘స్పై’ నుంచి రిలీజ్ అయిన ‘ఆజాది’ సాంగ్ కి అర్థం ఏంటో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇంతకు ముందు ‘కార్తికేయ 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించాడు. ఆ సినిమా విజయం సాధించడంతో స్వయంగా కేంద్ర హోంమంత్రి సైతం నిఖిల్ కలిసి పలు విషయాల గురించి మాట్లాడారు. తాజాగా ఇప్పుడు నిఖిల్ నటించిన స్పై మూవీ ఈ నెల 29న తొలి ఏకాదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Advertisement

ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్లను జోరుగా కొనసాగిస్తోంది. రోజుకు ఒక కొత్త అప్డేట్ ఇస్తూ ఉన్న తక్కువ సమయాన్ని బాగానే వాడుకుంటుంది. గూఢచారి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో దేశభక్తి గురించి కూడా బాగానే చూపిస్తున్నట్టు ట్రైలర్ లో తెలుస్తోంది. ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన ఒకపాట మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. సామాన్యుడిలో దేశభక్తిని రగిలిస్తూ.. ఉండే ఆ పాట సుభాష్ చంద్ర బోష్ మాటలను గుర్తు చేస్తు కొనసాగుతుంది. ‘ఆజాది’ అన్న పేరుతో స్పై చిత్ర యూనిట్ యూట్యూబ్ లో ఈ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అంటూ ఈ పాటను సింగర్ కాల భైరవ పాడారు.

Advertisement

ఈ పాటను ట్రెండ్ కి తగిన విధంగా తీయడంలో మ్యూజిక్ డైరెక్టర్ మంచి సక్సెస్ సాధించాడు. ఈ పాటలో సుభాష్ చంద్రబోస్ అన్న మాటని వాడుతూ లిరిక్స్ ఉంటుంది. అదే ‘తుమ్ మఝే ఖూన్ దో’ మై తుఝే ఆజాది దున్గా అంటే నీ రక్తాన్ని అర్పిస్తే నేను నీకు స్వాతంత్య్రాన్ని ఇస్తానని అర్థం. ఇలాంటి వాక్యాలన్నీ కలిపి రైటర్  కృష్ణ చైతన్య మంచి పాటను రాశాడు. ఈ పాట థియేటర్లో వింటుంటే.. గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ.. ఈ సినిమాకి ఆజాది పాట ప్లస్ అవుతుంది. ఈ పాట ద్వారా సుభాష్ చంద్ర బోష్ కి మంచి ట్రిబ్యూట్ ఇచ్చినట్టు కూడా ఉంది. ఈ మూవీలో సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ఏదో విషయమే అని చెబుతున్నారని ఈ పాట వింటుంటే.. అర్థం అవుతుంది. మరీ స్పై మూవీ విడుదలయ్యే లోపు ఈ చిత్ర యూనిట్ నుంచి ఇంకెన్నీ అప్డేట్ లు వస్తాయో.. ఈ మూవీపై ఎంత హైప్ పెంచుతారో వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

దిల్ రాజు పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. అందుకోసమేనా ?

ప్రేమ, పెళ్లి పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు.. మా ఆవిడతోనే..!

Visitors Are Also Reading