Home » దిల్ రాజు పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. అందుకోసమేనా ?

దిల్ రాజు పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. అందుకోసమేనా ?

by Anji
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- దిగ్గజ దర్శకుడు శంకర్‌ కాంబోనేషనట్ ఓ  ప్రతీష్టాత్మక చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే  టైటిల్ కూడా ఖరారు చేసారు. ఈ గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు ప్రముఖ తెలుగు నిర్మాత దిల్‌ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా శంకర్ సినిమాల కోసం ప్రత్యేక అభిమానులుంటారు. ఈ సినిమా 2024 సమ్మర్‌లో విడుదల చేయనున్నట్టు  గతంలో చిత్ర  యూనిట్ వెల్లడించింది. 

Advertisement

తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. ఈ మూవీ  2024 సమ్మర్‌లో విడుదల కాకపోవచ్చు అనే  సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే..? రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులు ఇటీవలే  ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. చరణ్‌ తన కూతురితో గడపడం కోసం కొద్ది రోజులు షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారనీ తెలుస్తోంది. దీంతో శంకర్‌ కూడా తన వేరే ‍ప్రాజెక్టుల మీద దృష్టిపెట్టారట. ఒక్కసారిగా ఇలా షూటింగ్‌కు బ్రేక్‌ పడేసరికి విడుదల తేదీ సమ్మర్‌ నుంచి వాయిదా పడే అవకాశముందని  టాక్ వినిపిస్తోంది. 

Advertisement

Ram Charan

ఈ సినిమా విడుదలయ్యే వరకు ఎలాంటి అప్డేట్స్  లేకుండా ఉండటం చాలా కష్టమనే చెప్పాలి.  అయితే అప్‌డేట్ల కోసం అభిమానులు పరితపిస్తున్నారు. ముఖ్యంగా బారసాల తర్వాతనే రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. డైరెక్టర్ శంకర్ కూడా కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2′ సినిమా ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత “గేమ్ ఛేంజర్” సినిమాను కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టైటిల్ పోస్టర్ తప్ప సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఒక రకంగా దిల్‌రాజుపై అప్‌డేట్ల కోసం యుద్ధానికి దిగారు ఫ్యాన్స్. ఈ మేరకు సోషల్‌ మీడియాలో దిల్‌ రాజుపై ట్రోలింగ్స్‌ చేస్తున్నారు. ‘యూజ్‌లెస్‌ దిల్‌రాజు.. షేమ్‌ లెస్‌ ఏస్‌వీసీ’’ అనే హ్యాష్‌ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ప్రేమ, పెళ్లి పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు.. మా ఆవిడతోనే..!

త్వరలోనే హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి..?

Visitors Are Also Reading