Home » ప్రేమ, పెళ్లి పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు.. మా ఆవిడతోనే..!

ప్రేమ, పెళ్లి పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు.. మా ఆవిడతోనే..!

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భారతదేశంలో గర్వించదగిన దర్శకుల్లో రాజమౌళి ముందువరుసలోనే ఉంటారు. తన సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు దేశం మొత్తానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు జక్కన్న. రాజమౌళి సినీ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ లేని సినిమా దర్శకుడిగా మంచి పేరుంది. ఇన్ని విజయాలు సాధించడంలో తన భార్య రమా రాజమౌళి పాత్ర కూడా ఉందని చాలా సందర్భాల్లో చెప్పారు. తన సినిమాల విషయంలో ఆమె కృషి చాలా ఉంటుందని పేర్కొన్నారు. 

Advertisement

గతంలో ఓ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ.. భార్య రమతో ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. 1992 నుంచి నేను డైరెక్టర్ అవుదామని అనుకుంటున్నాను. అప్పటి నుంచి నాకు కాన్ఫిడెన్స్ పోయింది. మధ్యలో ఎనిమిది నెలల నుంచి సంవత్సరం వరకు ఆ కాన్ఫిడెన్స్ పోయింది. డైరెక్టర్ గా మనం పైకి రాకపోతే ఎలాగా..? ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. ఎందుకో తెలుసా.. ప్రేమలో పడ్డాను. ఆ ముందు తర్వాత నాకు ఎప్పుడూ ఆ భయం లేదు. ప్రేమంటే భయం కాదు బాధ్యత. సినిమా అనేది నిలకడ లేనిది ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు వస్తుందనుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అసలు ఊహించలేం.

Advertisement

పెళ్లి పీటాకులు అనుకుంటే ఆ రెండింటికీ చుక్కెదురు కదా.. నేను ప్రేమ అంటున్నాను.. కానీ వాస్తవానికి అది ప్రేమ కాదు అది ఒక ఆకర్షణ మాత్రమే. ఒక అమ్మాయితో కలిగిన ఆకర్షణ సమయంలో అలా ఉండింది. మా ఇద్దరి మధ్య గొడవలు రాకుండా మొదటి నుంచి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాం. సినిమా విషయంలో నా పక్కనే ఉండి సపోర్ట్ చేయాలని చెప్పాను. నేను ఫస్ట్ ఏదైనా మా ఆవిడతోనే చెప్పేస్తాను. అక్కడ సమస్య లేదు. మీకు ఇంకా  తెలియదు. అది కాకుండా వేరే లవ్ మ్యాటర్ను మా ఆవిడను పంపించి క్యాన్సల్ చేశానని చెప్పారు. గతంలో రాజమౌళి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

త్వరలోనే హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి..?

వామ్మో.. ‘ప్రాజెక్ట్ కె’ కోసం కమల్ హాసన్ రెమ్యూనరేషన్ అంత తీసుకుంటున్నాడా..?

Visitors Are Also Reading