Home » పాన్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా ?

పాన్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా ?

by Anji
Ad

పాన్ కార్డు గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరాలను తెలుసుకోవాలంటే పాన్ కార్డు తప్పనిసరి. బ్యాంకు ఖాతా తీయడం నుంచి లావాదేవీలు, ఇతర ఆర్థికపరమైన పనుల కోసం పాన్ కార్డు తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ దాదాపు పాన్ కార్డు కలిగి ఉంటున్నారు. ఇప్పటివరకు ప్రతీ ఏడాది ఉద్యోగులు, వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు తప్పనిసరి కావాల్సిందే. వ్యాపార లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు కావాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 01న పార్లమెంట్ లో బడ్జెట్ ను సమర్పించండి. ఈ నేపథ్యంలో పాన్ కార్డు పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

Advertisement

ఏదైనా వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పనులకు పాన్ కార్డుతో పాటు ఇతర పత్రాలు కావాల్సి ఉంటుంది. పలు రకాల వ్యాపారాల గుర్తింపు ప్రక్రియకు పాన్ కార్డు తప్పనిసరి చేయనున్నది. 2023-24 కి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లీగల్ ఫ్రేమ్ వర్క్ ప్రతిపాదిస్తారని సమాచారం.ఇప్పటివరకు వివిధ వ్యాపార లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు, ఇన్వెస్టర్లు ఆయా ప్రాజెక్టులకు క్లియరెన్స్, అధికారులు, పలు శాఖల నుంచి అప్రూవల్ పొందేందుకు నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ కింద ఒకటి కంటే ఎక్కువ గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి వచ్చేది. ఇన్వెస్టర్లు, వ్యాపారులకు అలాంటి బాధ లేకుండా పాన్ కార్డు ఒక్కటే సమర్పించేవిధంగా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ లో ప్రకటించే అవకాశముంది. 

Advertisement

Also Read :  అందరి ముందే కోపంతో కుర్చీ విసిరేసిన చిరంజీవి..బిత్తరపోయిన దర్శకుడు..!

Manam News

 ఫైనాన్స్ యాక్ట్ 2023లో నిబంధన చేరుస్తారని.. తెలుస్తోంది. ఏదేని సంస్థను గుర్తించాలంటే పాన్ కార్డు ఉంటే చాలు నిబంధనలకు చట్టబద్ధత చేకూర్చనున్నట్టు సమాచారం.  ఈ విషయం పై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుదలకు కేంద్ర ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగం అదనపు కార్యదర్శి నేతృత్వంలో వర్కింగ్ గ్రూప్ సిఫారసులు చేసింది. ఆ సిఫారసుల ప్రకారమే బిజినెస్ లావాదేవీల గుర్తింపునకు పాన్ కార్డు చట్టబద్ధం చేస్తారని సమాచారం. నిబంధనలు అమలులోకి తీసుకొస్తే.. బిజినెస్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థ రిజిస్ట్రేషన్, లైసెన్స్ దాని ప్రారంభానికి అధికారిక క్లియరెన్స్ లకు పాన్ కార్డు ప్రాథమిక గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. విధానాన్ని దశల వారిగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also Read :  ఈ రకమైన అరటిపండును తింటున్నారా..? అయితే, మీరు అనారోగ్యం పాలైనట్టే ..!

Visitors Are Also Reading