ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడితో కూడిన ఉద్యోగం, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో నేటి రోజుల్లో జనాలు బాధపడుతున్నారు. సాధారణంగా మనిషి జీవనశైలిలో తినడానికి, పడుకోవడానికి, ఉదయం నిద్ర లేవడానికి ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది. నేటి రోజుల్లో మాత్రం ఆ సమయాన్ని పాటించేవారు చాలా తక్కువ అని చెప్పాలి. అయితే పని ఒత్తిడితో ఉన్నవారు, ఆరోగ్యంగా ఉండాలంటే, అరటిపండు తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Advertisement
అరటి పండులో ఫైబర్, విటమిన్ బి-6, విటమిన్-ఏ, ఐరన్, సోడియం, పొటాషియం, కాల్షియం వంటి విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండు తినడం వల్ల శరీరానికి త్వరగా శక్తి లభిస్తుంది. అరటిని అన్ని ఉష్ణ మండల ప్రాంతాలలో పండిస్తారు. అరటిపండ్ల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో అరటిపండు వినియోగం చాలా ఎక్కువ. ఉపవాసాలు, పండుగల సమయంలో డిమాండ్ చాలా పెరుగుతుంది. ఈ సమయంలో అరటిపండు ధరలు ఆకాశాన్ని అంటుతాయి.
Advertisement
banana
అయితే, అరటి పండ్లకు అధిక డిమాండ్ ఉన్నందున, అరటి పండ్లను త్వరగా పండించడానికి కార్బైడ్ ను ఉపయోగిస్తారు. పిండి పదార్థాలలో పండిన అరటిపండు తినడం వల్ల ఆరోగ్యం చెడు ప్రభావం పడుతుంది.కార్బైడ్ తో పండిన అరటి పండ్లు మార్కెట్ లో విరివిగా లభిస్తున్నాయి. ఈ అరటి పండ్లు తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. కార్బైడ్ తో పండిన అరటిపండు శరీరంలోని జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనిని తినడం వల్ల వికారం, కళ్ళలో మంట వంటి సమస్యలు వస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ట్యూమర్ల వంటి వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అరటి పండ్లను కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.
Advertisement
read also : కొత్త సంవత్సరం వేళ మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. తెలంగాణ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్ !