Home » నిద్రించేముందు గోరు వెచ్చని నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసా..?

నిద్రించేముందు గోరు వెచ్చని నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసా..?

by Anji
Ad

సాధారణంగా అధిక బ‌రువు త్వరగా తగ్గాలంటే.. నిత్యం గోరు వెచ్చని నీటిని తాగాల‌ని ఆయుర్వేదం చెబుతోంది. అయితే వేడి నీటిని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గడమే కాదు.. జీర్ణ సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి. ఇక  గ్యాస్ సమస్య అనేది అస్సలు ఉండ‌దు. అజీర్తితో బాధ‌ప‌డేవారు గోరు వెచ్చని నీటిని తాగితే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణమవుతుంది. అయితే గోరు వెచ్చని నీటిని రోజు మొత్తంలోనే కాదు.. నిద్రకు ఉపక్రమించే ముందు కూడా తాగాలి. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి. అవి ఏంటో ఇప్పుడు మనం  తెలుసుకుందాం.

Advertisement

Advertisement

ప్రధానంగా ఆయిల్  ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది పేరుకుపోయి కొవ్వులా మారుతుంది. అందుకే జంక్ ఫుడ్స్ కి  దూరంగా ఉండటం చాలా ఉత్తమం. ఫుడ్ తో పాటు ప్రతీ రోజు కనీసం 40 నిమిషాల పాటు కచ్చితంగా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల  కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. బరువు అధికంగా పెరగకుండా ఉండాలంటే ముఖ్యంగా వాకింగ్ లేదా వ్యాయామంతో పాటు కొన్ని ఎక్సర్ సైజ్ లు చేస్తే మీ బరువును కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

 

అదేవిధంగా మనం నిద్ర పోవడానికంటే ముందు గోరు వెచ్చని నీటిని తాగితే మాన‌సిక ప్రశాంత‌త క‌లుగుతుంది. డిప్రెష‌న్‌, ఒత్తిడిని త‌గ్గిస్తాయి. మాన‌సిక ఆందోళ‌న తొల‌గిపోతుంది. నిద్ర చక్కగా ప‌డుతుంది. శ‌రీరంలో ఉండే విష‌, వ్యర్థ పదార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శరీరంలో ద్రవాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. అధిక బ‌రువుతో ఇబ్బంది పడేవారు త్వరగా త‌గ్గుతారు. అజీర్తి స‌మ‌స్య పోతుంది.

 

Visitors Are Also Reading