Home » ఎన్టీఆర్ సినిమాకి ఇంత మ్యాజిక్ జరిగిందా.. ఆ పరమ శివుడే ప్రత్యక్ష్యం అయ్యాడా ?

ఎన్టీఆర్ సినిమాకి ఇంత మ్యాజిక్ జరిగిందా.. ఆ పరమ శివుడే ప్రత్యక్ష్యం అయ్యాడా ?

by Anji
Ad

నట సార్వభౌముడు, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా ఆయన రాముడు,  కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, రావణాసురుడు, శివుడు ఎలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలోనే లీనమై పోయేవారు. ఆ పాత్రని పోషించే ఎన్టీఆర్ కాదు.. తెలుగు తెరపౌ పౌరాణిక పాత్రలంటే.. గుర్తుకొచ్చే నటులు చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో ఎన్టీఆర్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. ఓ సినిమా కోసం ఎన్టీఆర్ శివుడి వేషం వేసినప్పుడు ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. 

Also Read :  The Kerala Story Movie Review : ది కేరళ స్టోరీ రివ్యూ… వివాదాలకు కేరాఫ్ అడ్రస్

Advertisement

నిర్మాత అశ్వినిదత్ నిర్మాణంలో లెెజెండరీ కే.వీ.రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ శివుని పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి మరో స్టార్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ అసిస్టెంట్ దర్శకుడిగా చేస్తున్నారు. శివుని పాత్ర అంటే.. మెడలో నాగుపాము ఉండాల్సిందేగా.. అందుకే అప్పట్లో కొందరూ రబ్బర్ పాములు వాడే వారు. కొందరూ కోరలు తీసేసిన నిజం పాములతోనే షూటింగ్ చేసేవారు. రబ్బర్ పాము మెడలో వేసుకుంటే ఎన్టీఆర్ కి ఎలర్జీ వస్తుండటంతో కోరలు తీసేసిన నిజమైన పాముతోనే షూటింగ్ కొనసాగించేవారట. అయితే ఆ సీన్ కి ముందే పాములను ఆడించే వ్యక్తి పాముకి ట్రైనింగ్ లాంటిది ఇస్తుంటాడు. ఈ తరుణంలో పాముకి ట్రైనింగ్ ఇస్తుంటే.. ఎన్టీఆర్ ఏం చేస్తున్నారని అడిగారట. పాము మెడలో ఉండేవిధంగా ట్రైనింగ్ ఇస్తున్నాడని సింగీతం శ్రీనివాస్ చెప్పారట. దానికి ఎన్టీఆర్ బదులు ఇస్తూ.. ఏం అవసరం లేదు. వారిని వదిలేయండి. ఆయనే వస్తారు  మెడలోకి అని చెప్పారట. అది విన్న కేవీ రెడ్డి ఆయనకి బ్రెయిన్ ఉందని.. పాముకి బ్రెయిన్ ఉంటుందని అనుకుంటున్నాడా అని పేర్కొన్నాడట. 

Advertisement

Also Read :  ‘ఏజెంట్’ నిర్మాతలకు భారీ నష్టాలు… రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన అఖిల్!

సీన్ స్టార్ట్ అయి వెనకాల సౌండ్ ప్లే అవ్వడంతో పాము మెల్లగా కదిలి వెళ్లి ఎన్టీఆర్ మెడకి ఆభరణం అయిందట. అది చూసిన కే.వీ.రెడ్డి ఎన్టీఆర్ కి చేతులెత్తి దణ్ణం పెట్టి రామారావు నువ్వు గొప్ప వ్యక్తివి కాదు.. అంతకు మించి అంటూ వ్యాఖ్యానించారట. ఇక ఈ విషయాన్ని నిర్మాత అశ్వినీదత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. గత ఏడాది మే 28 నుంచి శకపురుషుడి శతజయంతి ఉత్సవాలు అంటూ సంవత్సరాది వేడుకలను నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రారంభించారు. ఇటీవల విజయవాడలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యఅతిథిగా విచ్చేసి శతజయంతి అంకురార్పణ సభను ఘనంగా నిర్వహించిన విషయం విధితమే. మే 28న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించనున్నారు.  

Also Read :     “పుష్ప 2” లో మెగా డాటర్… వార్తల్లో వాస్తవం ఉందా..?

Visitors Are Also Reading