Home » ఈ స్టార్ దర్శకులు.. ఒకప్పుడు అసిస్టెంట్ దర్శకులుగా పని చేశారనే విషయం తెలుసా ?

ఈ స్టార్ దర్శకులు.. ఒకప్పుడు అసిస్టెంట్ దర్శకులుగా పని చేశారనే విషయం తెలుసా ?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న దర్శకులు కొంతమంది సొంతంగా తొలి సినిమాతోనే దర్శకులుగా మారితే.. మరికొంది మంది మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్లు గా కెరీర్ ని ప్రారంభించిన వారు ఉన్నారు. వారిలో దర్శకుడు కావాలనే కళ్ళతో ఇండస్ట్రీకి వచ్చి నప్పటికి కొంతమంది మాత్రమే గురువుకు తాగిన శిష్యులుగా గుర్తింపు పొందారు. ప్రస్తుతము టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా ఉన్న కొందరు ఒకప్పుడు కొంతమంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. వారిలో ఎవరెవరు ఏ డైరెక్టర్ దగ్గర పని చేశారు ఇప్పుడు మనము తెలుసుకుందాం. 

Advertisement

 

కృష్ణవంశీ :

Manam News

కృష్ణవంశీ కుటుంబ కథా చిత్రాలను ఎక్కువగా తెరకెక్కిస్తుంటాడు. అయితే కృష్ణవంశీ వచ్చింది మాత్రం రాంగోపాల్ వర్మ స్కూలు నుంచే కావడం విశేషం. రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కృష్ణవంశీ గులాబీ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా, మురారి, ఖడ్గం, సింధూరం వంటి సినిమాలతో టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా ఎదిగిపోయారు. ఈ మధ్యకాలంలో వరుస ప్లాపులను ఇస్తున్న కృష్ణవంశీ ప్రస్తుతము రంగమార్తాండ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో మళ్లీ పాత కృష్ణవంశీ దర్శకత్వం కనిపిస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

పూరి జగన్నాథ్  :

Manam News

దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.  బద్రి సినిమాతో టాలీవుడ్ డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి హ్యాట్రిక్స్ హిట్స్ వచ్చాయి. మహేష్ బాబుతో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి ఇచ్చాడు. మధ్యలో కాస్త జోరు తగ్గినప్పటికీ.. రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు పూరి. తన దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ ని చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాడు. 

హరిష్ శంకర్ :

Manam News

రచయితగా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ని ప్రారంభించాడు దర్శకుడు హరిశంకర్. ఈయన తిరక్కకి ఇచ్చిన తొలి చిత్రము షాక్ కి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అవకాశం ఇచ్చింది రాంగోపాల్ వర్మ అనే.. కానీ ఆ సినిమా ఆశించిన మేరకు ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దగ్గర చిరుత బుజ్జిగాడు వంటి సినిమాలకు రచయితగా పనిచేశాడు. ఆ తర్వాత రవితేజ హీరోగా మిరపకాయ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో.. పవన్ కళ్యాణ్ తో   గబ్బర్ సింగ్ సినిమా తెరకెక్కించాడు. దీంతో హరి శంకర్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ తిరిగిందని చెప్పాలి. గబ్బర్ సింగ్తో పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీ హిట్టునిచ్చాడు. 

తేజ :

Manam News

Advertisement

ప్రేమ కథలు దర్శకుడు తేజ కూడా రాంగోపాల్ వర్మ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. వర్మ దగ్గరే ఉండి చాలా సినిమాలకు సినిమాతో గ్రఫర్ గా పనిచేశాడు. చిత్రం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు తేజ. వరుస హిట్స్ సాధించిన తర్వాత పరాజయాలను చూసిన తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో అందుకున్నాడు. 

సుకుమార్ :

Manam News

విధి వినాయకు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు దర్శకుడు సుకుమార్. వినాయక దర్శకత్వంలో వచ్చిన బిల్లు సినిమా టైటిల్స్ లో సుకుమార్ పేరుని మీరు గమనించవచ్చు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి వినాయకు దగ్గర నుంచి వచ్చిన సుకుమార్ డిఫరెంట్ మూవీస్ తీసి వసంత్ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆర్య సినిమాతో దర్శకుడుగా మారి.. పుష్ప సినిమా  వరకు కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు తెరకెక్కించి అభిమానుల మనసులను దోచుకున్నాడు సుకుమార్. 

రాజమౌళి :

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు జక్కన్న. ఈయన గురువు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. తొలుత కొన్ని సీరియల్స్ కి అసిస్టెంట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన శాంతినివాసం అనే సీరియల్ కి దర్శకత్వం వహించాడు రాజమౌళి. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన తర్వాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్నారు రాజమౌళి. 

సందీప్ రెడ్డి వంగ :

తొలి సినిమాతోనే ప్రపంచం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తాను తెరకెక్కించిన తొలి చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లోని కాలిబర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. 2010 నుంచి ఇండస్ట్రీలో పలు విభాగాల్లో పని చేసిన సందీప్ కేడి మళ్లీమళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలకు దర్శకుడు క్రాంతి మాధవ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అర్జున్ రెడ్డి రీమేక్ అబర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో కూడా ప్రవేశించాడు సందీప్ రెడ్డి. 

Also Read :   మెగా డాటర్‌ శ్రీజకు ప్రపోజ్‌ చేసిన ప్రీతమ్‌ జుకల్కర్‌ ?

నాగ్ అశ్విన్ :

Manam News

కీర్తి సురేష్ ప్రధాన పాత్రగా సావిత్రి జీవిత చరిత్రను మహానటి సినిమాను తెరకెక్కించి తెలుగు తో పాటు యావత్ సినీ ప్రేక్షకులకు సావిత్రి గారిని పరిచయం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. చిత్రంలో నాని స్నేహితుడిగా విజయ్ దేవరకొండ నటించాడు. సినిమా కంటే ముందు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు నాగ్ అశ్విన్.  

Also Read :  అంద‌రికీ న‌చ్చాల‌ని లేదు…మ‌రోసారి నోరుపారేసుకున్న‌ ర‌ష్మిక మంద‌న‌..!

Visitors Are Also Reading