Telugu News » Blog » అంద‌రికీ న‌చ్చాల‌ని లేదు…మ‌రోసారి నోరుపారేసుకున్న‌ ర‌ష్మిక మంద‌న‌..!

అంద‌రికీ న‌చ్చాల‌ని లేదు…మ‌రోసారి నోరుపారేసుకున్న‌ ర‌ష్మిక మంద‌న‌..!

by AJAY
Ads

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక ప్ర‌స్తుతం పుష్ఫ పార్ట్ 2 లో న‌టిస్తోంది. పుష్ఫ‌తో పాన్ ఇండియా లెవ‌ల్ లో క్రేజ్ రావ‌డంతో ర‌ష్మిక బాలీవుడ్ లోనూ అవ‌కాశాలు అందుకుంటోంది. ఇక ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్న ర‌ష్మిక సొంత గ‌డ్డ‌పై మాత్రం వివాదాల‌ను ఎదురుకుంటోంది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుండి ర‌ష్మిక కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. కాగా ఈ సినిమాకు కాంతార ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రోహిత్ శెట్టి హీరోగా న‌టించాడు.

Advertisement

సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ర‌ష్మిక రోహిత్ శెట్టితో ల‌వ్ లో ప‌డింది. ఆ త‌ర‌వాత వీరి ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది. కానీ ఈ జంట పెళ్లి పీట‌లు ఎక్క‌లేదు. ర‌ష్మిక రోహిత్ శెట్టికి బ్రేక‌ప్ చెప్పింది. దాంతో క‌న్న‌డ ప్రేక్ష‌కులు రోహిత్ శెట్టి అభిమానులు ర‌ష్మిక‌ను దారుణంగా ట్రోల్స్ చేశారు. అంతే కాకుండా ర‌ష్మిక ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌ను చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి పేరు చెప్ప‌కుండా సోకాల్డ్ డైరెక్ట‌ర్ అంటూ సైగ‌లు చేసింది.

Advertisement

ఆ వీడియో కాస్తా నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో ర‌ష్మిక పై ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి. మ‌రోవైపు ఓ ఇంట‌ర్యూలో సౌత్ లో మాస్ పాటలు ఉంటాయ‌ని బాలీవుడ్ లో రొమాంటిక్ పాట‌లు ఉంటాయ‌ని అవంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని కామెంట్ లు చేసింది. ఆ దెబ్బ‌తో సౌత్ మొత్తం ర‌ష్మిక పై ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. ఇక తాజాగా ఆ ట్రోల్స్ పై ర‌ష్మిక స్పందించింది.

న‌టి అయినంత‌మాత్రాన అంద‌రూ ఇష్ట‌ప‌డతార‌ని చెప్పలేం….ఇక్క‌డ ప్రేమ‌, ద్వేషం రెండూ ఉంటాయి. నేను ప‌బ్లిక్ సెల‌బ్రెటీని వారితో మాట్లాడుతా..వారితోనే ఉంటా ఈ క్ర‌మంలో నా మాట‌లు వారికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. నా చేతులతో చేసే సంజ్ఞ‌లు న‌చ్చ‌క‌పోవ‌చ్చు…నా ఎక్స్ప్రెష‌న్స్ న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ కొంద‌రికి ప్రేమ ఉంటుంది క‌దా వారికి కృత‌జ్ఞురాలిని అంటూ ర‌ష్మిక వ్యాక్యానించింది.

Advertisement

ALSO READ : అనాధలాగా కృష్ణ శవం…నరేష్ చేసిన పనికి విజయనిర్మల ఆత్మ ఎంత బాధపడిందో – రమ్య రఘుపతి