Home » మెగా డాటర్‌ శ్రీజకు ప్రపోజ్‌ చేసిన ప్రీతమ్‌ జుకల్కర్‌ ?

మెగా డాటర్‌ శ్రీజకు ప్రపోజ్‌ చేసిన ప్రీతమ్‌ జుకల్కర్‌ ?

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల అంటే తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. అనేకసార్లు వార్తల్లో శ్రీజ హాట్ టాపిక్ గా మారారు. మొదట రిషి భరద్వాజ్ అనే వ్యక్తిని శ్రీజ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ సమయంలో వీరి పెళ్లి వార్త హాట్ టాపిక్ గా మారింది. తల్లిదండ్రులను ఎదిరించి మరి శ్రీజ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. అయితే ఒక కూతురు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి.

Advertisement

దాంతో విడాకుల తీసుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం పాటు సింగిల్ గా ఉన్న శ్రీజ కళ్యాణదేవ్ ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఆమె త్వరలోనే కళ్యాణ్ కు విడాకులు ఇస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవాలని భావిస్తుందట. ఈ వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోని ఆమె న్యూ ఇయర్ సందర్భంగా ఓ పోస్ట్ చేసింది.

2022లో నన్ను నేను కనుగొన్నాను. నన్ను నాకంటే బాగా ఎవరు అర్థం చేసుకోలేరు అంటూ ఆమె పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ కు ప్రీతమ్ జూకల్కర్ స్పందించాడు. లవ్ సింబల్ పెట్టి ఐ లవ్ యు అంటూ కామెంట్ చేశాడు. దాంతో వీరిద్దరి నడుమ ఏదో జరుగుతుందనే టాక్ మొదలైంది. ప్రీతమ్ సమంతకు స్టైలిష్ డిజైనర్ గా చేస్తున్నారు. అప్పట్లో సమంత అతనితో క్లోజ్ గా ఉండటంతో అతని కారణంగానే చైతులు విడాకులు ఇచ్చాడనే టాక్ కూడా నడిచింది. ఇప్పుడు శ్రీజకు ప్రపోజ్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మెగా డాటర్‌ స్పందించాల్సిందే.

READ ALSO : అంతర్జాతీయ క్రికెట్ నుండి అర్షదీప్ ఔట్..!

Visitors Are Also Reading