Home » చిరంజీవి సీరియల్ లో నటించాడనే విషయం మీకు తెలుసా ?

చిరంజీవి సీరియల్ లో నటించాడనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

స్టార్ హీరోలుగా ఉన్న ఎంతో మంది హీరోలు తొలుత వారి కెరీర్ ను బుల్లితెరపై  కెరీర్ ను ప్రారంభించిన వారే.  అలాగే ఆ తరువాత సినిమాలో అవకాశాలు రావడంతో వెండితెరపై స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. తాజాగా కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న రాక్ స్టార్ యాష్ కూడా తొలుత తన కెరీర్ ను బుల్లితెర మీదే ప్రారంభించాడు. అంతేకాకుండా.. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూడా తన కెరీర్ ఆరంభంలో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆ తరువాత సినిమా అవకాశాలు రావడంతో బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు.

Also Read :  Agent : “ఏజెంట్” సినిమా ట్రైలర్‌…దుమ్ములేపిన అఖిల్‌

Advertisement

ఇప్పుడు ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయం ఏంటంటే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్ ప్రారంభంలో ఓ సీరియల్ లో నటించారట. చిరంజీవి సీరియల్ లో నటించారని చాలా మందికీ తెలియదు. అంతేకాదు… ఈ విషయం చెబితే చాలా మంది అసలు నమ్మరు. చిరంజీవి సీరియల్ లో నటించారనేది అక్షరాలా నిజం. సీరియర్ లో నటించిన తరువాత సినీ అవకాశాలు రావడంతో హీరోగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారాడు. చిరంజీవి రెండు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు.

Advertisement

Also Read :  సౌందర్య వేల కోట్ల ఆస్తులు.. ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే..?

Manam News

చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో హిందీలో వచ్చే డైలీ సీరియల్ రజినీలో నటించారట చిరంజీవి. ఈ సీరియల్ లో ఓ గెస్ట్ పాత్రని పోషించారట. ఆ తరువాత కొన్ని ఎపిసోడ్ లలో చిరంజీవి పాత్ర కూడా ఉందట. అప్పటికే చిరంజీవికి వరుస సినిమా అవకాశాలు రావడంతో ఆ సీరియల్ పూర్తిగా నటించలేకపోయారట. చిరంజీవి తొలుత ఓ టీవీ సీరియల్ లో కూడా నటించారనేది మాత్రం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి..  ప్రస్తుతం మెగాస్టార్ గా కొనసాగుతున్నారు.

Also Read :  విజయ్ దళపతి హీరోగా తెలుగులో మరో సినిమా ?

Visitors Are Also Reading