Home » సౌందర్య వేల కోట్ల ఆస్తులు.. ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే..?

సౌందర్య వేల కోట్ల ఆస్తులు.. ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందాలతో ఊపు ఊపేసిన సౌందర్య అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒకానొక సమయంలో ఈ హీరోయిన్ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు కూడా వెయిట్ చేసేవారు అంటే ఈమె ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సౌందర్య 31 ఏళ్లకే కన్ను మూసింది. పెళ్లి అయి ఏడాది కూడా కాకముందే మరణించడం చాలా దారుణం. ఇక 100కు పైగా చిత్రాల్లో నటించిన సౌందర్య తమిళ, కన్నడ,తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో నటించింది. కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది. అప్పటి స్టార్ హీరోలందరితో తెరను పంచుకున్న ఈ బ్యూటీ వేలకోట్ల ఆస్తులు సంపాదించిందట.

also read:విజయ్ దళపతి హీరోగా తెలుగులో మరో సినిమా ?

Advertisement

also read:చిరంజీవి కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారా..?

Advertisement

ప్రస్తుతం ఈ ఆస్తులపై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తన సోదరుడైన అమర్నాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సౌందర్య. కానీ అనూహ్యంగా సౌందర్య మరణించడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికీ ఆమె స్థాపించిన కొన్ని విద్యాలయాలకు నిధులు వెళుతూనే ఉన్నాయి. కానీ ఆమె చనిపోయిన కొన్ని రోజులకే ఆస్తి గొడవలు మొదలయ్యాయి.

ఆమె ఆస్తి కోసం భర్త రఘు కూడా చాలా ప్రయత్నాలు చేశారట, సౌందర్య కూడా వీలునామ రాసారని అందులో ఉన్న దాని ప్రకారం తమకు కూడా ఆస్తులు పంచాలని అమర్నాథ్ భార్య నిర్మల, ఆమె కుమారుడు సాత్విక్ 2009లో బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. అసలు సౌందర్య వీలునామా రాయలేదని నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామ సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, కోర్టుకు తెలియజేశారు. ఇక ఆమె చనిపోయినప్పటి నుంచి వేలాదికోట్ల ఆస్తుల కోసం గొడవలు పెట్టుకుని 2013 డిసెంబర్ మూడవ తేదీన ఆ కుటుంబీకులంతా రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

also read:నాగబాబు ఎంపీగా పోటీ.. ఏ జిల్లా నుంచి అంటే..?

Visitors Are Also Reading