Home » బాలీవుడ్ లో తొలి సినిమాకే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

బాలీవుడ్ లో తొలి సినిమాకే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

by Anji
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో చాలా ఫేమస్ అయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఎల్లలు దాటుతోంది. ఆయన సినిమాలపై యావత్ భారత్ లో ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే వార్ 2 బాలీవుడ్ మూవీలో యాక్ట్ చేసే అవకాశం పట్టేశారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 మూవీలో  ఎన్టీఆర్ కీలక రోల్ చేస్తున్నాడు. ఇదివరకు ఎన్నడూ చేయని సరికొత్త పాత్రతో దేశవ్యాప్తంగా ఆసక్తినెలకొంది.   నందమూరి వారసుడిగా టాలీవుడ్ లో సత్తా చాటుతున్న ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

Also Read :  “పుష్ప 2” లో ఐటమ్ సాంగ్లో ఆ హాట్ బ్యూటీ… హింట్ కూడా ఇచ్చేసింది..?

Advertisement

బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన హృతిక్ రోషన్ తో ఓ మల్టీస్టారర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మూవీ కోసం తారక్ అందుకునే రెమ్యూనరేషన్ వివరాలు అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తున్నాయి. RRR మూవీతో ఎన్టీఆర్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఊహించని స్థాయిలో ఆయన మార్కెట్ పెరిగిపోయింది. దీంతో వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ రూ.30కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.  

Advertisement

Also Read :  వెంకటేష్, నానితో సుధీర్ బాబు పోటీ పడనున్నారా ?

ఈ సినిమాలో ఎన్టీఆర్ చేయబోయేది నెగెటివ్ రోల్ పైగా తక్కువ నిడివి ఉన్న పాత్రనే అయినా ఈ రేంజ్ లో ఇచ్చేందుకు ముందుకొచ్చారట మేకర్స్. యశ్ రాజ్ ఫిల్మ్స్ వార్ 2 అనే స్పై థ్రిల్లర్ అనే మూవీ రూపొందిస్తుంది. సినిమాను బ్రహ్మాస్త్ర వంటి సినిమాను తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ దర్శకత్వం చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారని తెలియడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో  క్యూరియాసిటి పెరిగింది. ఈ మూవీలో వీరిద్దరూ కూడా స్పై క్యారెక్టర్స్ చేయనున్నారు. ఈ మూవీ 2024లో చివరిలో పట్టాలెక్కనుంది. ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఈ సినిమాలో హైలెట్ కాబోతుందని అంటున్నారు. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు. 

Also Read :   రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరోల సినిమాలు ఏవో తెలుసా…!

Visitors Are Also Reading