Home » రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరోల సినిమాలు ఏవో తెలుసా…!

రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరోల సినిమాలు ఏవో తెలుసా…!

by Bunty
Published: Last Updated on
Ad

హిందీ, తెలుగు ఏవైనా… సినిమాలు అన్నాక హిట్లు, ఫ్లాపులు కామన్. హిట్ వస్తే సినిమా చేసిన నటులతో పాటు దర్శకుడికి మంచి పేరు వస్తుంది. నిర్మాతకు కాసుల వర్షం కురుస్తుంది. అయితే కొన్నిసార్లు సినిమాలు డిజాస్టర్లు కావడంతో నిర్మాతలు కోలుకోలేని దెబ్బ తింటారు. అలాంటి సందర్భాల్లో హీరోలు, హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటే మరో సినిమాలో డబ్బులు తీసుకోకుండా నటించడం చేస్తారు. అయితే, రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరోల సినిమాలు ఏవో తెలుసా…ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.

READ ALSO : టాలీవుడ్ హీరోకు 10 లక్షల ఫైన్ కట్టిన ఆర్తి అగర్వాల్…చివరికి ఆ పని చేసి…!

Advertisement

# ఏజెంట్

ఏజెంట్ ఫ్లాప్ కావడంతో అఖిల్ కూడా రెమ్యూనరేషన్ ఇచ్చేశాడట.

# రజనీకాంత్

బాబా మూవీ రిలీజ్ అయ్యాక డిస్ట్రిబ్యూటర్స్ బాగా లాస్ అవ్వడంతో రజనీకాంత్ తన రెమ్యూనరేషన్ లో చాలా భాగం వాళ్లకి ఇచ్చేసారట.

READ ALSO : Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్‌ ?

# పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జానీ, కొమరం పులి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ప్రొడ్యూసర్ల అంచనాలు తలకిందులై భారీ నష్టం వాటిల్లింది. ఈ సమయంలో తాను తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్.

# బాలకృష్ణ

బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఆశించిన రిజల్ట్ రాబట్టకపోవడంతో బాలయ్య బాబు తన పారితోషికాన్ని రివర్స్ ఇచ్చేశారు.

Advertisement

# మహేష్ బాబు

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా ఖలేజా సినిమా ఇలాగే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో నిర్మాతకు భారీగా నష్టం వాటిల్లడంతో ఆ సమయంలో మహేష్ బాబు తన రెమ్యూనరేషన్ అంతా తిరిగి ఇచ్చేశారు.

# రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అట్టర్ ఫ్లాప్ కావడంతో తను కూడా తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు రామ్ చరణ్.

# సమంత

రీసెంట్ గా సమంత లీడ్ రోల్ లో వచ్చిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయింది. దీంతో ఈ సినిమాకు గాను తాను తీసుకున్న పారితోషకం మొత్తం వాపాస్ ఇచ్చేసిందట.

# విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తీరా విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. దీంతో తన పారితోషికాన్ని వెనక్కి ఇచ్చారు విజయ్ దేవరకొండ.

# రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ సినిమాకు గాను తాను తీసుకున్న పారిపోషకాన్ని తిరిగి ఇచ్చేశారు రవితేజ.

# సాయి పల్లవి

సాయి పల్లవి నటించిన పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో తన రెమ్యూనరేషన్ ను సాయి పల్లవి వెనక్కి ఇచ్చింది.

READ ALSO : DMIT Test : పెళ్లికి ముందే పెళ్లి కొడుకు మైండ్ సెట్ ను కొలిచే పరీక్ష… అన్ని రహస్యాలు తెలుసుకోవచ్చు!

Visitors Are Also Reading