Home » “పుష్ప 2” లో ఐటమ్ సాంగ్లో ఆ హాట్ బ్యూటీ… హింట్ కూడా ఇచ్చేసింది..?

“పుష్ప 2” లో ఐటమ్ సాంగ్లో ఆ హాట్ బ్యూటీ… హింట్ కూడా ఇచ్చేసింది..?

by AJAY
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్లో పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 1 లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీలో బన్నీకి జోడిగా నటించగా… మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. మలయాళ విలక్షణ నటుడు ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో నటించిన ఈ మూవీలో సునీల్, అనసూయ, రావు రమేష్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

Advertisement

ఈ సినిమాలో సమంత “ఊ అంటావా ఊ ఊ అంటావా” అనే స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ స్పెషల్ సాంగ్ కు ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ లభించింది. ఇలా పుష్ప పార్ట్ 1 మూవీలోని స్పెషల్ సాంగ్కు అదిరిపోయే రేంజ్ క్రేజ్ రావడంతో పుష్ప 2 మూవీలో కూడా స్పెషల్ సాంగ్ పెట్టబోతున్నట్లు… అందులోనూ సమంతనే ఉండబోతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సమంత “పుష్ప 2” మూవీలో ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుంది అనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తోంది.

Advertisement

కాకపోతే పుష్ప పార్ట్ 2 మూవీలో ఐటమ్ సాంగ్ మాత్రం ఖచ్చితంగా ఉండబోతున్నట్లు… అందులో ఒక హాటెస్ట్ బ్యూటీ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రన్ రాజా రన్ మూవీతో మంచి విజయాన్ని మంచి గుర్తింపును సంపాదించుకున్న సీరత్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో అల్లు అర్జున్ తో ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ “ఎదగడానికి డ్యాన్సర్లకు రెక్కలు అవసరం లేదు.. అది తెలుసుకున్న వారికి వారి ఎనర్జీ దారిచూపుతుంది” అంటూ రాసుకుంది.

దానితో ఈ ఫోటోను చూసిన కొంతమంది నెటిజన్లు పుష్ప 2 మూవీలో ఈ హాట్ బ్యూటీ నే ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుంది అని… ఈ విధంగా ఈ ముద్దుగుమ్మ హింట్ ఇచ్చింది అని పేర్కొంటున్నారు. మరి నిజంగానే పుష్ప 2 మూవీలో ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్ లో నటిస్తుందో లేదో చూడాలి.

Visitors Are Also Reading