Home » పరగడుపున వెల్లుల్లిని తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

పరగడుపున వెల్లుల్లిని తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

by Anji
Ad

వెల్లుల్లిని తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం మనందరికీ తెలిసిందే. వంటల్లో వెల్లుల్లిని వాడటం వల్ల వాటికి అదనపు రుచి వస్తుంది. ఇందులో ఉండే ఔషద గుణాలు జలుబు, ఫ్లూ, జ్వరం, హై బీపీ నివారణకు ఉపయోగపడుతుంది. ఒంట్లో పేరుకుపోయినటువంటి కొవ్వు కరగడానికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండెపోటు ముప్పు తగ్గడంతో పాటు ధమనులు మూసుకోవడం, గట్టిపడటం లాంటి సమస్యలు తగ్గుముఖం పడుతాయి. వెల్లుల్లి పలు రకాల క్యాన్సర్ల భారీ నుంచి కాపాడుతుంది. 

Also Read :  ఈ వేరు దొరికితే వదలకండి.. దీంతో కోటీశ్వరులు అవుతారు..!

Advertisement

ఉదయం పరగడపున వెల్లల్లిని తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఏమి తినకుండా వెల్లుల్లిని తినే విషయంలో కొందరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల సహజ యాంటి బయోటిక్ గా పని చేస్తుంది. ఇందులో యాంటి బయోటిక్ గుణాలు జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. పరగడుపున వెల్లుల్లి తినడం వల్ల హై బీపీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తప్రసరణ మెరుగు పరిచి గుండె జబ్బులను తగ్గిస్తుంది. కాలేయం, మూత్రాశయం పనితీరు కూడా చాలా మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి డయేరియాను అధిగమించడానికి వెల్లుల్లి అద్భుతమైన మందులా పని చేస్తుంది. 

Advertisement

Also Read :  భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!

ఒంట్లో విష పదార్థాలను బయటికి పంపించే శక్తిమంతమైన ఆహార పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. పరగడుపున వెల్లుల్లి తినడంతో కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయి. డయాబెటిస్, డిప్రెషన్, విష జ్వరాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. టీబీ, న్యూమోనియా, జలుబు, ఊపిరితిత్తుల్లో కఫం చేరడం, ఆస్తమా, దగ్గు వంటి సమస్యలకు చక్కని ఔషదంగా పని చేస్తుంది. టీబీతో బాధపడే వారు రోజుకు వెల్లిపాయను పూర్తిగా తినడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఒకేసారి కాకుండా వీలు అయినప్పుడల్లా పచ్చిది తినలేని వారు ఓవెన్ లో రంగు మారే వరకు వేడి చేసుకొని తినవచ్చు. వెల్లుల్లి అంటే అలర్జీ ఉన్న వారు పచ్చి వెల్లిపాయ తినకపోవడం చాలా మంచిది. చర్మంపై దద్దుర్లు వచ్చినా, ఒళ్లు వెచ్చగా ఉన్నా తలనొప్పి వస్తున్నా పరగడుపున వెల్లుల్లి తినడం మానేయాలి.  

Also Read :  ఆదివారం రోజు మాంసం తింటే ఏమవుతుందో తెలుసా ?

Visitors Are Also Reading