Home » ఆదివారం రోజు మాంసం తింటే ఏమవుతుందో తెలుసా ?

ఆదివారం రోజు మాంసం తింటే ఏమవుతుందో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లో నోరూరించే గుమగుమ వాసన వస్తుంది. చాలా మంది ఆదివారం రోజు తప్పకుండా నాన్ వెజ్ తీసుకుంటారు. ఓవైపు సుక్క, మరో వైపు ముక్కతో ఆరోజును చాలా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తుంటారు.  కానీ వాస్తవానికి  ఆదివారం సూర్యుడికి సంబంధించిన వారం. సూర్యుడు ప్రత్యక్ష దైవం.. కొన్ని ప్రాంతాల్లో సూర్యుడి కోసం ప్రత్యేకంగా దేవాలయాలు కూడా ఉన్నాయి.  సూర్య దేవుడికి  హిందువులు చాలా ప్రాధాన్యత ఇస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడు నవగ్రహాధిపతి అని వేదాలు  పేర్కొంటున్నాయి.

Also Read :  ఈ వేరు దొరికితే వదలకండి.. దీంతో కోటీశ్వరులు అవుతారు..!

Advertisement

 

అందుకే ఆలయాలలో సూర్యుడు నవగ్రహాల మధ్యలో కనిపిస్తుంటాడు.  ఉదయం నిద్ర లేవగానే సూర్యుడికి నమస్కారం చేయడం, సంధ్యావందనం వంటి వాటి ద్వారా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం హిందూ సాంప్రదాయంలో ఉంది. సూర్యుని రథానికి ఏడు గుర్రాలని, అవి ఏడు రంగుల ఇంద్రధనస్సును సూచిస్తాయని అంటుంటారు. సూర్యునికి ఇష్టమైన ఆదివారం రోజు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది. దీంతో ఏ విధమైన భగవత్కార్యాలు చేయలేరు. ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడతాయి.

Advertisement

Also Read :  వేసవిలో రోజంతా ఉత్సాహంగా ఈ జ్యూస్ తప్పక తీసుకోండి..!

Manam News

 

హిందువుల్లో కొందరు కొన్ని రోజులలో మాంసాహారం తినరు. సాధారణంగా శనివారం, శుక్రవారం, సోమవారం, మంగళవారం మాంసాహారం నిషిద్ధం. అదేవిధంగా  కొన్ని పండుగలు, వ్రతాలుంచేటప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఉదాహరణకి సాంబ పురాణంలోని సూర్యాష్టకం లో స్త్రీ, తైల, మధు, మాంసాహారం నిషిద్ధం. ఆదివారం కొన్ని రకాల ఆహారాలను తినకూడదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆదివారం మాంసాహారం తీసుకోకుండా.. ఉప్పులేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందట. అంతేకాదు..  ఆరోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఎన్నో ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అట. ఏడు ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు చదివి చూడండి. మితాహారం తీసుకోవడం, సూర్యోపాసనం చేయడం  వల్ల మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులను మీరే గమనించకోండి.

Also Read :  భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!

Visitors Are Also Reading