Home » తల్లి కడుపులో పిండానికి తల్లిదండ్రుల రూపం ఎలా వస్తుందో తెలుసా..?

తల్లి కడుపులో పిండానికి తల్లిదండ్రుల రూపం ఎలా వస్తుందో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మన భారతదేశంలో స్త్రీని దేవతగా భావిస్తారు. స్త్రీ లేనిదే ఈ ప్రపంచం లేదని చెప్పవచ్చు. అలాంటి స్త్రీ తల్లిగా, చెల్లిగా, భార్యగా ఇలా ఎన్నో అవతారాలు ఎత్తుతుంది. ఇందులో ప్రతి స్త్రీకి గొప్ప అవతారం తల్లి. అది స్త్రీ జీవితంలో పెళ్లి తర్వాత తల్లవడం అనేది ఒక కొత్త అనుభూతి. మరి తల్లి కడుపులో పెరుగుతున్న పిండానికి తల్లి తండ్రి రూపం ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం ప్రపంచంలో చాలా వరకు పెళ్లిళ్లు వారి దగ్గరికి బంధువుల నుంచి జరుగుతున్నాయి. ఇక మన ఇండియాలో ఎక్కువగా మేనరికం పెళ్లిళ్లు జరుగుతాయి. ఇలాంటి వివాహాలను వైద్య పరిభాషలో కన్ సాంగ్వీనియస్ మ్యారేజ్ అంటారు.

also read:లిఫ్టులో ఒంటరిగా 17ఏళ్ల అమ్మాయి..అందులోకి దూరిన ఇద్దరు యువకులు.. వీడియో చూస్తే..!!

Advertisement

also read:షుగర్ ఉన్నవారు మామిడి పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?

Advertisement

మేనరిక వివాహాలు చేసుకున్న వారికి పుట్టుకతోనే లోపాలతో బిడ్డలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తలసీమియా, మూత్రపిండాల వ్యాధులు, నరాల వ్యాధులు, బుద్ధి మాంద్యం, కండరాలు, గుండెలో రంధ్రాలు వంటి అనారోగ్య సమస్యలు మేనరికం పెళ్లిలలో ఎక్కువగా వస్తుంటాయి. అలా అని అందరికీ అలాగే పుడతారని కూడా కచ్చితంగా చెప్పలేం. మేనరికపు వివాహాలు చేసుకున్న వారిలో నాలుగు నుంచి ఆరు శాతం మందికి ఈ విధంగా జరగవచ్చు. మరి పుట్టే బిడ్డలో లోపాలు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలంటే పిండం ఏర్పడే విధానాన్ని తెలుసుకోవాలి. మానవకణంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అంటే మొత్తం 46 క్రోమోజోములు.

వీటిలో 23 మహిళ నుంచి, మరో 23 పురుషుల నుంచి వస్తాయి. అవి కలిసి ఒక కణంగా ఏర్పడతాయి. ఆ కణం పిండంగా మారుతుంది. ఈ జన్యువు లే తండ్రి నుంచి తల్లి నుంచి పోలికలను మోసుకొస్తాయి. వేర్వేరు కుటుంబాలకు చెందిన స్త్రీ పురుషుడు కలవడం వల్ల ఆరోగ్యకరమైన పిండం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఓకే కుటుంబానికి చెందిన మేనరికం స్త్రీ పురుషుల పెళ్లి చేసుకుంటే ఇద్దరి జన్యులు ఒకే విధంగా ఉండవచ్చు. ఇందులో అనారోగ్యకరమైన జన్యులు కలవచ్చు. అప్పుడు పుట్టే బిడ్డలో లోపాలు తలెత్తవచ్చు. అందుకే మేనరిక వివాహాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు అంటున్నారు. ఇందులో పుట్టే బిడ్డకు తల్లి తండ్రి రూపం రావడానికి కారణం ఇద్దరి క్రోమోజోములు కలవడమే.

also read:

Visitors Are Also Reading