Home » మెగాస్టార్ మిస్ చేసుకున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా ? 

మెగాస్టార్ మిస్ చేసుకున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా ? 

by Anji
Ad

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన వర్మ ఒకప్పుడు సూపర్ హిట్ మూవీలను తెరకెక్కించి టాలీవుడ్ గతినే మార్చేశాడు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన శివ పాతికేళ్లు అయినా ఆ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. అప్పటివరకు చూడని యాక్షన్, స్క్రీన్ ప్లే, టేకింగ్, మేకింగ్ శివతో పరిచయమైంది. ఆర్జీవీ పేరు అప్పటి నుంచి  ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. దీంతో పాటు బాలీవుడ్ కి వెళ్లి రంగీలా.. సత్య వంటి సూపర్ హిట్ తీసి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసాడు. ప్రస్తుతం వర్మ సినిమాలు నాసిరకంగానే ఉంటున్నాయి. ఒకప్పుడు ఆర్జీవీ తీసిన సినిమాలు  క్లాసిక్ మూవీ లిస్ట్ లో మిగిలాయి. 

Advertisement

తెలుగులో శివ సినిమాతో వర్మకు ఎంత గుర్తింపు లభించిందో.. హిందీలో రంగీలా మూవీతో ఆ రేంజ్ గుర్తింపు సంపాదించుకున్నాడు వర్మ. రంగీలా మూవీ తెలుగులోనే తెరకెక్కిల్సిందట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, శ్రీదేవి కలిసి నటించాలి. కానీ వారికి ఈ మూవీ దక్కలేదు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అశ్వనిదత్ చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. శివ సినిమా హిట్ తరువాత నాతో ఓ సినిమా చేయాలని రామ్ గోపాల్ వర్మకు అడ్వాన్స్ ఇచ్చారు. అప్పుడే వర్మ నాకు రంగీలా, గోవిందా గోవిందా సినిమాలకు సంబంధించిన కథలను వినిపించారు.

Advertisement

 

రంగీలా మూవీని చిరంజీవి, రజినీకాంత్, శ్రీదేవిలతో కలిసి తీస్తే సూపర్ హిట్ అవుతుందని అనుకున్నాడట వర్మ. కానీ నాకు గోవిందా గోవిందా మూవీ కథ నచ్చింది. వేంకటేశ్వరుడి హుండీ చుట్టూ ఆ కథ తిరుగుతుంది. అందుకే నేను ఆ సినిమాను ఓకే చేసి నాగార్జునతో తీశాను. రంగీలా సినిమాలో కథ మొత్తం శ్రీదేవి చుట్టూ ఉంటుంది. చిరంజీవి, రజినీ పాత్రలు అనేవి అంత ఇంపాక్ట్ చూపించవు అని అనుకున్నాను. అందుకే నేను ఆ సినిమా తీయలేదని అశ్వనిదత్ తెలిపారు. చివరకు రంగీలా సినిమాను వర్మ బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్, అమిర్ ఖాన్, ఊర్మిళతో తీశాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. బాలీవుడ్ ని మొత్తం షేక్ చేసింది రంగీలా. కానీ గోవిందా గోవిందా ఇక్కడ ప్లాఫ్ అయింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Sithara : అమెరికా టైమ్‌ స్వ్కేర్‌పై సితార.. ఫుల్ ఖుషీలో మహేష్ బాబు ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

విడాకుల కోసం మెగా డాటర్ నిహారిక దరఖాస్తు ?

Visitors Are Also Reading