Home » Sithara : అమెరికా టైమ్‌ స్వ్కేర్‌పై సితార.. ఫుల్ ఖుషీలో మహేష్ బాబు ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Sithara : అమెరికా టైమ్‌ స్వ్కేర్‌పై సితార.. ఫుల్ ఖుషీలో మహేష్ బాబు ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేక పరిచయం అయితే అవసరం లేదు. సోషల్ మీడియాలో తన అల్లరితో చిన్నప్పటి నుంచి అలరిస్తూ వచ్చిన సితార తాజాగా లంగాఓణిలో స్టెప్పులేసి అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన అభిమానులను మరో సారి ఫుల్ ఖుష్ చేశారు. తన డాన్స్, స్టడీ, గేమ్స్, ట్రిప్స్.. ఇలా అన్ని విషయాల గురించి సితార తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు.

Advertisement

తాజాగా.. ఆమె ఫోటోలు అమెరికా టైమ్‌ స్వ్కేర్‌పై దర్శనం ఇచ్చాయి. దీనిని అభిమానులు తమకు గర్వకారణంగా భావిస్తున్నారు. అటు చదువులోను, ఇటు అల్లరి లోను ఫస్ట్ ఉండే సితార.. తాజాగా తన తొలి కమర్షియల్ యాడ్ లో నటించారు. ఇటీవలే ఆమె ‘పీఎంజే జువెలరీ’కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఈ యాడ్ లో నటించడం కోసం సితార దాదాపు మూడు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నారు.

Advertisement

సితార నటించిన తొలి కమర్షియల్ యాడ్ ను ‘సితార కలెక్షన్స్‌’ పేరిట అమెరికాలోని న్యూ యార్క్ లో టైమ్‌ స్వ్కేర్‌పై ప్రదర్శించారు. ఈ విషయాన్నీ మహేష్ సోషల్ మీడియా టీం తెలిపారు. సితారకు సంబంధించిన ఈ ఫోటోలు నెట్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో సితార రకరకాల జ్యూవెలరీ వేసుకుని చాలా అందంగా కనిపిస్తున్నారు. సితార అందం, ప్రతిభని చూసి నెటిజన్స్, ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !

Shubman Gill : టీమిండియా కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ?

2007 లో ధోనీనే కెప్టెన్‌గా ఎందుకు BCCI నియమించింది ?

Visitors Are Also Reading