Home » చిరంజీవి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన సినిమాల గురించి మీకు తెలుసా ?

చిరంజీవి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన సినిమాల గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి దాదాపు తెలిసే ఉంటుంది. కానీ ఆయన గురించి కొన్ని ఆసక్తికరవిషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో చిరంజీవి ప్రతినాయకుడి పాత్రల్లో నటించారు. దాదాపు 154 సినిమాల్లో నటించిన చిరంజీవి తన ఖాతాలో కూడా ఆగిపోయిన చిత్రాలున్నాయి. దాదాపు అరడజన్ కి పైగా సినిమాలు కమిట్ అయి స్టార్ట్ చేసి తరువాత నిలిచిపోయాయి. 

Advertisement

అందులో సింగీతం శ్రీనివాసరావు మెగాస్టార్ తో భూలోక వీరుడు అనే జానపథ మూవీ ప్రారంభించాడు. కానీ ఆరోజుల్లో ఈ మూవీకి భారీ బడ్జెట్ తో సినిమా తీయాలని ప్లాన్ చేసి కొద్ది రోజులు షూటింగ్ కూడా చేసిన తరువాత అవుట్ పుట్ ఆశించిన స్థాయిలో రావడం లేదని ఈ సినిమాను ఆపేశారు. 

అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వినాలని ఉంది అంటూ ఓ మూవీ స్టార్ట్ అయింది. ఇందులో టబు ఊర్మిళ చిరంజీవికి జోడీగా నటించేందుకు ఫిక్స్ చేశారు. రెండు పాటల చిత్రీకరణ తరువాత కథనం ఆకట్టుకోకపోవడంతో చిరంజీవి ఆ మూవీ నుంచి తప్పుకున్నాడు. 

చిరంజీవి హాలీవుడ్ రేంజ్లో స్టార్ట్ చేసిన అబూ బాగ్దాద్ గజదొంగ సినిమాని చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. కొన్ని కీలక సన్నివేశాలు కూడా తీశారు. ఇండియన్ భాషల్లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ తరువాత ముందుకు సాగలేదు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబోలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే మూవీని ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు జరిగాయి. కానీ ఈ మూవీ షూటింగ్ కూడా కాకుండానే ఆగిపోయింది.

Advertisement

ఎస్వీ కృష్ణారెడ్డి కంప్లీట్ కామెడీ డ్రామాను చిరంజీవితో చేయాలనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. అదేవిధంగా వీ.ఎన్.ఆదిత్య దర్శకత్వలో మెగాస్టార్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కథ చర్చలు కూడా జరిగాయి. ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. కానీ ఆ తరువాత ఎందుకో ఏమో ఈ మూవీ స్టార్ట్ కాలేదు. ఇక చిరంజీవి రాజకీయానికి గుడ్ బై చెప్పేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఆటోజానీ అనే సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా కథ పై అనుకున్న స్థాయిలో మెగాస్టార్ చిరంజీవికి నచ్చలేదు. కొన్ని మార్పులు చేయాలని కూడా సూచించారు. వాిని చేసి మళ్లీ పూరి మెగాస్టార్ కి వినిపించారు. కొత్త కథతో రిస్క్ చేయడం ఎందుకు అని తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తిని ఖైదీ 150గా రీమేక్ చేసి హిట్ కొట్టారు. దీంతో ఆటోజానీ కూడా పట్టాలెక్కలేదు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రజినీ తరవాత ఎన్టీఆర్ ఒక్కడికే సాధ్యమైన అరుదైన రికార్డు ఏంటో తెలుసా..?

పవన్ అన్నా లెజొనోవా మధ్య ప్రేమ ఎలా చిగురించిందో తెలుసా..? సినిమా రేంజ్ లవ్ స్టొరీ ఇదే..!

ఇండియన్ 2 విలన్ గా సైకో నటుడు ?

Visitors Are Also Reading