Home » ఇండియన్ 2 విలన్ గా సైకో నటుడు ?

ఇండియన్ 2 విలన్ గా సైకో నటుడు ?

by Bunty
Ad

విశ్వ నాయకుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. డిఫరెంట్ కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలాగే తమిళ ప్రేక్షకులను కమల్ హాసన్ అలరించిన సంగతి తెలిసిందే. దశావతారం సినిమాతో కమల్ హాసన్ క్రేజ్ ఎక్కడికో పోయింది. అయితే విశ్వ నాయకుడు కమలహాసన్ ఇప్పుడు ఇండియన్ 2 అనే సినిమాను చేస్తున్నారు. తమిళ అగ్ర దర్శకుడు శంకర్ ఈ సినిమాను చేస్తున్నారు.

Advertisement

1996లో కమల్ హాసన్ మరియు శంకర్ కాంబినేషన్ లో ఇండియన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇక ఆ సినిమాకే ఇప్పుడు సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లోకి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తి అయినట్లు చిత్ర పరిశ్రమ పేర్కొంది. తిరుమల, తైవాన్ లాంటి ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ తరుణంలోనే భారతీయుడు 2 సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.

Advertisement

ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు విలన్ గా నటిస్తున్నట్లు ఈ అప్డేట్ సారాంశం. కమలహాసన్ కు ప్రతి నాయకుడిగా… ఎస్ జె సూర్యను శంకర్ ఫైనల్ చేసినట్లు తమిళనాడు లో సర్కిల్స్ లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఎస్ జే సూర్య… చాలా సినిమాలలో విలన్ గా నటించారు. ఇక తెలుగులో మహేష్ బాబు నటించిన స్పైడర్ మాన్ సినిమాలో సూర్య విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆయననే ఫైనల్ చేసిందట చిత్ర బృందం.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

తెలంగాణలో వారందరికీ లక్ష రూపాయలు… ఇలా అప్లై చేసుకోండి

ఇండియాలోనే మొదటిసారిగా ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన ఎన్టీఆర్

సౌందర్యకు ‘డూప్’ గా నటించిన నటుడు ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading