Home » చిన్నపిల్లలకు ఈ సిరప్ ఇస్తున్నారా ? ఇవి చాలా ప్రమాదకరం..!

చిన్నపిల్లలకు ఈ సిరప్ ఇస్తున్నారా ? ఇవి చాలా ప్రమాదకరం..!

by Anji
Ad

సాధారణంగా చిన్నపిల్లలకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా  భయపడుతుంటాం.  అది చిన్న జలుబు, దగ్గు అయినా సరే భయపడి వెంటనే డాక్టర్ల దగ్గరికి తీసుకొని వెళ్తాం. వాళ్ళు ఇచ్చినటువంటి సిరప్ లు ఏదో దేవుడే ఇచ్చినట్టు గుడ్డిగా నమ్మి పిల్లలకు పట్టేస్తాం. అయితే వీటిలో చాలా వరకు ఫేక్ కోల్డ్ సిరప్ లు ఉన్నాయని అవి చాలా ప్రమాదకరమైనవని హెచ్చరికలు జారీ చేసింది  ప్రపంచ ఆరోగ్య సంస్థ. డైథిలిన్ గ్లైకాల్ తో కూడిన 4 భారతీయ దగ్గు సిరప్ లపై WHO హెచ్చరిక విడుదల చేసింది. ఈ సిరప్ లు అవసరానికి మించి కెమికల్స్ వాడుతున్నారని తేలింది. లాబొరేటరీ నుంచి వచ్చిన కోల్డ్ అవుట్.. అనే సిరప్ ను కూడా వాడొద్దని చెబుతున్నారు.


ఇరాన్, ఇరాక్ లాంటి ప్లేసుల్లో ఈ కోల్డ్ అవుట్ టానిక్ వల్ల అక్కడ చిన్నారులు చాలామంది మరణించినట్టు ఆధారాలున్నాని పేర్కొంటుంది WHO. పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియాలో, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో 66 మంది చిన్నారుల మరణానికి హర్యానాలోని సోనెపట్ లోని మైడెన్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసిన నాలుగు కలుషితమైన నాణ్యతలేని దగ్గు సిరప్ లు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది. అంతేకాదు.. చెన్నైలో తయారవుతున్న కోల్డ్ అవుట్ అనే మందును కూడా డాక్టర్ సజెస్ట్ చేసిన వాడకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నాలుగు మందులు భారతదేశంలోని మైడెన్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ ద్వారా ఉత్పత్తి చేసిన దగ్గు, జలుబు సిరప్ లు. డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ కలుషితాలుగా ఆమోదయోగ్యం కానీ మొత్తంలో ఉన్నందున వారు పరీక్షలో విఫలమయ్యారు అని గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ పేర్కొంది.

Advertisement

Advertisement

ఈ దగ్గు సిరప్ తీసుకోవడంతో చాలా మంది అమాయక పిల్లలకు ప్రాణాంతకంగా మారింది. దీనిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ పిల్లల మరణాలకు రెండు రసాయనాలు కారణమయ్యాయి. డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్. ఈ సమ్మేళనాలు పూర్తిగా రంగులేనివి, వాసన లేనివి. కానీ దగ్గు సిరప్ రుచి తీపి, పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఆ టానిక్ రసాయనం తీపి రుచి, నీటిలో కరగదు. పొత్తికడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, తలనొప్పి, మానసిక స్థితి మారడం, తీవ్రమైన మూత్రపిండ గాయాలు వంటి విషపూరిత ప్రభావాలు ఉన్నాయని తెలిపింది. అందుకే ఈ సిరప్ లు చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతున్నాయి.  కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవారు ఎవరైనా సిరప్ ల విషయంలో జాగ్రత్తగా ఉండటం బెటర్.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 చిరంజీవి చదివిన కళాశాలకు రమ్మంటే ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

బ్రహ్మ ముహూర్తంలో ఈ పనులు చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు..!

Visitors Are Also Reading