Home » చిరంజీవి చదివిన కళాశాలకు రమ్మంటే ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

చిరంజీవి చదివిన కళాశాలకు రమ్మంటే ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి  ఎదిగిన హీరో. అలాంటి చిరంజీవికి ఎంతమంది ఫాన్స్ ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సమాజంలో ఎక్కడైనా సరే మంచి,  చెడు ఉన్నట్టు చిరంజీవి మంచితనాన్ని గుర్తించేవారు కొందరైతే ఆయన తప్పులను కూడా గుర్తించేవారు ఇంకొందరు ఉంటారు. అలా చిరంజీవి చేసిన కొన్ని తప్పులను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

చిరంజీవి సీఎస్ఆర్ కళాశాలలో  చదివాడని.. ఆ కాలేజీ యాజమాన్యం వారు చిరంజీవిని ఫంక్షన్ కి రమ్మని ఆహ్వానించారట. అయితే  చిరంజీవి ఆ కాలేజీ వారిని ఐదు లక్షల రూపాయలు అడిగారని వార్తలు వినిపిస్తున్నాయి.  చివరికి చేసేదేమీ లేక వారు సుమన్ ని పిలిచి ఫంక్షన్ నిర్వహించారట. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఆ కళాశాలకు ఓసారి వెళ్దాం అనుకున్న సమయంలో ఆ కాలేజీ యాజమాన్యం వారు చిరంజీవి మొహం మీద గేట్లు వేసేశారట. అంతేకాదు.. చిరంజీవి సొంత ఇల్లును లైబ్రరీ కోసం అడిగితే దాన్ని అమ్మేసుకున్నారట. ఆ తర్వాత ఈ విషయం అందరికీ తెలిసి చిరంజీవి క్యారెక్టర్ అలాంటిదా అని అనుకోవడంతో, తానే సొంతంగా వేరే చోట ఒక లైబ్రరీని పెట్టించారట. ఈలోపు ఆయన ఇల్లు అమ్ముకున్న విషయం అందరికీ తెలిసిపోయింది.  ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన  కొత్తలో చిరంజీవి అభిమానుల ముట్టుకుంటే చేతులు కడుక్కున్నారని చెడు ప్రచారం కూడా చేశారు.

Advertisement

చిరంజీవి నటించిన చాలెంజ్ సినిమా వైజాగ్ బీచ్ లో జరుగుతుండగా కోదండరామిరెడ్డి అనుకున్న విధంగా చిరంజీవి నటించలేదట. దీంతో కోదండరామిరెడ్డి అలా కాదు సార్ ఇలా చేయాలి ని ఎన్నిసార్లు చెప్పాలి అని అన్నారట. అంతేకాకుండా కాళిదాస్ అనే మూవీ కోదండరామిరెడ్డి కొడుకు హీరోగా మొదలై కొద్దిపాటి షూటింగ్ జరిగిన తర్వాత హీరోను మార్చేశారట. దీని వెనుక కూడా చిరంజీవి హస్తముందని కొందరూ పేర్కొంటున్నారు.  ఈ సినిమా సమయంలో  ఒక ఫైట్ మాస్టర్ కాలుజారి కింద పడడంతో నడుము విరిగింది. ఆ మాస్టారుకు చిరంజీవి సహాయం చేస్తానని చెప్పి, కనీసం హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేదని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇవే కాకుండా ప్రజారాజ్యం పార్టీ టికెట్స్ అమ్ముకోవడం, ఉదయ్ కిరణ్ ఇష్యూ కూడా అందరికీ తెలుసిందే.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై మెగా అభిమానులు మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. అవన్నీ ఆధారాలు లేని న్యూస్ లు చిరంజీవి అంటే పడని వారు ఇలా  చేస్తున్నారని ఖండిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చిరంజీవిపై సోషల్ మీడియా నెగిటివ్ ప్రచారం మాత్రం బాగానే చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

పవన్ మూడు పెళ్ళిళ్ళపై సంచలన వీడియో రిలీజ్ చేసిన రేణు దేశాయ్..!

 తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. రెండోసారి భూమా మౌనిక రెడ్డి ప్రెగ్నెంట్ ?

 

Visitors Are Also Reading