Home » వెయిటింగ్ లిస్టులో ఉన్న రైల్వే టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేయండి…?

వెయిటింగ్ లిస్టులో ఉన్న రైల్వే టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేయండి…?

by Bunty
Ad

ప్రతి ఒక్కరు తమ లైఫ్ లో రైలు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు.  సాధారణంగా మనం ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే రైల్ టికెట్లు దొరకడం కష్టంగా ఉంటుంది. కొన్ని నెలల నుంచి చాలామంది ముందస్తుగా బుక్ చేసుకొని ఉంటారు. ఈ సమయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్నటువంటి టికెట్ వెంటనే కన్ఫర్మ్ కావాలి అంటే ఈ ట్రిక్స్ పాటించాల్సిందే. అదేంటో ఇప్పుడు చూద్దాం.

READ ALSO : Niharika konidela : నిహారిక పనుల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు

Advertisement

 

పండుగలు సీజన్ ఇతరత్రా బిజి సమయంలో మనం ట్రైన్ టికెట్ బుక్ చేసిన కానీ చాలామందికి వెయిటింగ్ లిస్టు చూపిస్తుంది. ఆ సమయంలో అదృష్టం ఉంటేనే కన్ఫామ్ అయితుంది. అయితే ఈ సమస్యను అధిగమించడం కోసం భారత రైల్వే కొత్త పరిష్కారాన్ని చూపిస్తోంది. అదే ఐఆర్సిటిసి వికల్ప్ స్కీం. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు బెర్త్ కన్ఫామ్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. దీన్నే ఆల్టర్నేటివ్ ట్రైన్ అకామడేషన్ స్కీం అని కూడా అంటారు. మనం ప్రయాణించే రైలులో బెర్తులు ఖాళీ లేనప్పుడు వెయిటింగ్ లిస్టులో టికెట్ తీసుకుంటాం.

Advertisement

READ ALSO : IPL 2023 : ఏమైంది సూర్య…ఎందుకు ఇలా ఆడుతున్నావ్?

ఉదాహరణకు మనం స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే అందులో కాళీ లేకపోతే ఆటో అప్ గ్రేడ్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా స్లీపర్ కంటే పై క్లాసులో వ్యక్తులు ఖాళీగా ఉంటే అందులో ప్రయాణం చేయవచ్చు. థర్డ్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిల్లో బెర్తులు ఖాళీగా ఉంటే ప్రయాణం చేసే వీలుంటుంది. దీనికి టికెట్ బుక్ చేసుకునే ముందు ఆటో అప్ గ్రేడ్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. కాళీ బెర్తులతో రైలు వృధాగా పోవడం ఎందుకని ఆ వ్యక్తుల్లో ఇలా టికెట్ కన్ఫామ్ అవ్వని వారి కోసం ఉపయోగపడేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

READ ALSO : పెళ్లి తర్వాత దరిద్రం పట్టిందా… భారీ సినిమా నుంచి నయనతార అవుట్?

Visitors Are Also Reading