Home » Niharika konidela : నిహారిక ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు

Niharika konidela : నిహారిక ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు

by Bunty
Published: Last Updated on

 

మెగా డాటర్ నిహారిక కొనిదెల విడాకులు తీసుకోబోతున్నట్టు కొంతకాలంగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం నిహారిక భర్త తన సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫోటోలను, వారు కలిసి దిగిన ఫోటోలు డిలీట్ చేయడమే. అంతే కాకుండా సోషల్ మీడియాలో చైతన్య నిహారికను అను ఫాలో చేశారు కూడా. కాగా ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. నిహారిక కూడా తన సోషల్ మీడియాలో భర్తను అన్ ఫాలో చేసింది. అంతేకాకుండా తమ పెళ్ళి ఫోటోలను మరియు భర్త ఫోటోలను డిలీట్ చేసింది.

read also : మన స్టార్ హీరో హీరోయిన్స్ అసలు పేర్లు ఇవేనని తెలుసా ? చాలామందికి తెలియని పేర్లు !

కేవలం తన తల్లితో దిగిన ఫోటో తప్ప మిగతా పెళ్లి ఫోటోలు అన్నింటిని నిహారిక డిలీట్ చేసింది. నిహారిక అలా చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్టు అవుతుంది. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు నిహారిక ఆస్తులు విలువ ఎంత అనే దానిపై చర్చ జరుగుతోంది. మనం దానిపై వివరాలు తెలుసుకుందాం. 1993 డిసెంబర్ 18న జన్మించిన నిహారిక హైదరాబాద్ సెయింట్ మెరీన్ కాలేజీలో చదువుకుంది. చదువు పూర్తయిన తర్వాత టీవీ యాంకర్ గా కెరియర్ ప్రారంభించి ఢీ జూనియర్ వంటి వాటికి హోస్ట్ గా వ్యవహరించి, ఒక మనసు సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టింది.

read also : Tirumala : వెంకటేశ్వర స్వామి కి “వడ్డికాసులవాడు” అని పేరు ఎలా వచ్చింది ?

ఈమె తమిళ వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. నిహారిక కొనిదెల పింక్ ఎలిఫెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ప్రారంభించింది. కొన్ని నివేదికల ప్రకారం ఈమె మొత్తం ఆస్తుల విలువ 2020 నాటికి నాలుగు మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 కోట్ల కంటే ఎక్కువ. ఈమె ఒక్కో సినిమాకి సుమారు రూ.25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేది అని కూడా చెబుతున్నారు. నిహారిక హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో నివసించేది. ఆమెకు సొంతంగా జర్మన్ లగ్జరీ బ్రాండ్ ఆడి కారు కూడా ఉంది.

READ ALSO : పేపర్ కప్పులో టీ తాగితే అంత డేంజరా?

Visitors Are Also Reading