Home » మీకు కాబోయే భార్యతో పొరపాటున కూడా ఈ విషయాలను చర్చించకండి.. జాగ్రత్త !

మీకు కాబోయే భార్యతో పొరపాటున కూడా ఈ విషయాలను చర్చించకండి.. జాగ్రత్త !

by Anji
Ad

సాధారణంగా పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక భాగం. ప్రస్తుతం పెళ్లికి ముందు చాలా మంది తమకు సంబంధించిన ప్రతీ విషయాన్ని కాబోయే భర్తతో చర్చిస్తారు. కానీ పూర్వకాలంలో అలాంటివి ఏమి లేవు. కొన్ని సందర్భాల్లో పెళ్లి జరిగే వరకు కూడా ఒకరినొకరు చూసుకునే వారు కూడా కాదు. ఇప్పుడు కాలం మారిపోయింది. టెక్నాలజీ డెవలప్ అయింది. చాలా మంది పెళ్లి సంబంధం కుదరగానే కాబోయే భార్య, భర్తలు పలు విషయాల గురించి చర్చించుకుంటుండటం.. బంధం మరింత బలపడుతుందని భావిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో ఒక్కోసారి రివర్స్ అవుతుంటుంది. అసలే టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. పెళ్లి చేసుకునే అమ్మాయిలు లేదా అబ్బాయిలు వ్యక్తిగత విషయాలను పంచుకోవడం అంతా మంచిది కాదంటున్నారు నిపుణులు. పెళ్లికి ముందు ఎలాంటి విషయాలను చర్చించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  అంబానీ కోడ‌లు మెడ‌లోని నెక్లెస్ ఖ‌రీదు. అక్ష‌రాల 500 కోట్లు! ఇంత‌కీ నెక్లెస్ స్పెషాలిటీ ఏంటీ !

Advertisement

  • పెళ్లి చేసుకునే అబ్బాయి, లేదా అమ్మాయి పెళ్లి కాక ముందు, పెళ్లి అయిన తరువాత కూడా మీ బలహీనతలకు సంబంధించి ఎలాంటి విషయాలను కూడా జీవిత భాగస్వామితో అస్సలు చర్చించకూడదు. దీనిని అడ్డుపెట్టుకొని మిమ్మల్ని వేధించే అవకాశముంది.  
  • ముఖ్యంగా కొంత మంది అబ్బాయిలు ఎమోషనల్ గా ఉంటారు. వారి జీవితంలో అడుగుపెట్టిన భాగస్వామికి వెంటనే తమ జీవితం గురించి వివరిస్తుంటారు. లైఫ్ లో ఎదుర్కొన్న అవమానాల గురించి ప్రస్తావిస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. 
  • భార్య తనకు తన భర్త ఉన్నాడు అని చాలా గర్వంగా ఫీల్ అవుతుంటుంది. అలాంటి భర్తకే అవమానం జరిగిందంటే అతడు చిన్న చూపు చూడబడుతాడు. వారి నమ్మకం అంతా కరిగిపోతుంది. ఓ రకమైన చిన్న చూపు ఏర్పడే అవకాశముంటుంది. కొద్ది రోజులు గడిచిన తరువాత చెప్పినట్టయితే అర్థం చేసుకునే పరిస్థితులుంటాయి. 
  • కుటుంబం అనేది మనందరి జీవితాల్లో ముఖ్యమైంది. కుటుంబం గౌరవం కాపాడటం మనపై ఆధారపడి ఉంటుందనే విషయం అందిరికీ తెలిసిందే. 

Also Read :  బలగం సినిమా ద్వారా తొమ్మిదేళ్ల తర్వాత ఒక్కైటన అక్కా, తమ్ముడు

Advertisement

  • కొత్త బంధంలోకి అడుగుపెట్టిన తరువాత కుటుంబ రహస్యాలను మీ ప్రియుడు లేదా స్నేహితుడితో అస్సలు షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మీరు చెప్పే రహస్యాల కారణంగా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశలున్నాయి. 
  • మరో విషయమేంటంటే.. మీ భార్య తల్లిదండ్రులను, ఆమె తరపు బంధువులను ఎలాంటి పరిస్థితిలో తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇలా మీ భార్య తరపు వారి గురించి మీరు చులకనగా మాట్లాడితే మీ మధ్య గొడవలు చోటుచేసుకునే అవకాశాలుంటాయి. వారి విషయంలో చాలా జాగ్రత్త ఉండటం మంచిది. 
  • ఇతర వ్యక్తులతో తమ కుటుంబ సభ్యులను పోల్చి చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. పొరపాటున కూడా ఇతర భార్యలతో మీ భార్యను అస్సలు పోల్చి చూడకండి. అలా పోల్చి మాట్లాడితే.. మీ బంధం అక్కడితో తెగిపోయే ప్రమాదముంది. ఎందుకంటే ఏ భార్య అయినా తమ భర్త తమని మంచిగా పొగడాలని కానీ ఇతర భార్యలను పొగుడుతూ తమను చులకన చేస్తే అస్సలు తట్టుకోలేరు. 
  • ఏ మనిషి అయినా జీవితంలో చిన్న చిన్న పొరపాట్లను చేయడం సహజం. మీ భార్య తెలిసి తెలియక చిన్న తప్పులు చేస్తే.. ఆ తప్పులను ప్రతీసారి వారికి తెలియజేస్తూ.. బాధపెట్టకూడదు. మీ మధ్య గొడవలు పెరిగిపోయి బంధం తెగిపోయే అవకాశాలున్నాయి.  

Also Read :  నరేష్ ప‌విత్ర‌ల “మ‌ళ్లీ పెళ్లి” సినిమా క‌థ లీక్…అదే పెద్ద ట్విస్ట్..?

Visitors Are Also Reading