Home » నరేష్ ప‌విత్ర‌ల “మ‌ళ్లీ పెళ్లి” సినిమా క‌థ లీక్…అదే పెద్ద ట్విస్ట్..?

నరేష్ ప‌విత్ర‌ల “మ‌ళ్లీ పెళ్లి” సినిమా క‌థ లీక్…అదే పెద్ద ట్విస్ట్..?

by AJAY

టాలీవుడ్ న‌టుడు వీకే న‌రేష్ గ‌త కొంత‌కాలంగా న‌టి ప‌విత్ర‌తో డేటింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట కేవ‌లం వీరి డేటింగ్ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. కానీ ఆ త‌ర‌వాత న‌రేష్ ప‌విత్ర‌లు త‌మ రిలేష‌న్ షిప్ ను అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించారు. న‌రేష్ కు ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు జ‌రిగి పెటాకులు అవ్వ‌గా ప‌విత్ర‌తో పెళ్లి జ‌రిగితే అది నాలుగో పెళ్లి అవుతుంది. ఇక ప‌విత్ర లోకేష్ డేటింగ్ పై ప్ర‌స్తుతం నెట్టింట దారుణంగా ట్రోల్స్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

 

ఓ వైపు ట్రోల్స్ వ‌స్తుంటే మ‌రోవైపు న‌రేష్ ప‌విత్ర ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మ‌ళ్లీ పెళ్లి అంటూ ఓ సినిమాలో న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ను సైతం విడుద‌ల చేశారు. ఇక ఈ సినిమాను న‌రేష్ విజ‌య‌కృష్ణ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు ఎంఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక తాజాగా విడుద‌ల చేసిన టీజ‌ర్ వీడియో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

అయితే ఈ టీజ‌ర్ చూసిన త‌ర‌వాత అస‌లు క‌థ కూడా ప్రేక్ష‌కులకు అర్థ‌మైపోయింది. ఈ సినిమా టీజ‌ర్ సీన్ లు చూస్తుంటే ప‌విత్ర లోకేష్ న‌రేష్ ల ల‌వ్ స్టోరీ ఆధారంగానే ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు తెలిపోతుంది. అంతే టీజ‌ర్ లో న‌రేష్ మూడో భార్య అత‌డి పై మ‌రియు ప‌విత్ర‌పై హోట‌ల్ లో దాడి చేసిన సీన్ కూడా క‌నిపిస్తుంది.

అంతేకాకుండా సినిమా టీజ‌ర్ లో త‌న మూడో భార్య పాత్ర‌ను పాజిటివ్ గా చూపించాడు. కానీ సినిమాలో మాత్రం ప‌విత్ర చాలా ప‌విత్ర‌మైన‌ద‌ని తాను కూడా మంచి వాడిన‌ని న‌రేష్ చూపించే ఛాన్స్ ఉంద‌ని నెటిజ‌న్ లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతే కాకుండా త‌న మూడో భార్య‌ను విల‌న్ గా చూపించే ఛాన్స్ ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ALSO READ :“కార్తీక‌దీపం” అత్త‌కు రియ‌ల్ లైఫ్ భ‌ర్త ఎవ‌రో తెలుసా..? ఏం చేస్తారో తెలిస్తే అవ‌క్కావ్వాల్సిందే..!

Visitors Are Also Reading