Home » బాలకృష్ణతో హ్యాట్రిక్ కొట్టిన దర్శకులు.. ఎవరో తెలుసా..?

బాలకృష్ణతో హ్యాట్రిక్ కొట్టిన దర్శకులు.. ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి సంబంధించి హీరో బాలకృష్ణ అంటే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.. ఆయన నటన ఏ విధంగా ప్రత్యేకంగా ఉంటుందో బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆ విధంగానే డిఫరెంట్ స్టైల్లో ఉంటారు.. అలాంటి బాలయ్య కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. అలాంటి బాలయ్య సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు సృష్టించారు.. ఆయనతో కొంతమంది హ్యాట్రిక్ కొట్టిన దర్శకులు కూడా ఉన్నారు.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

ALSO READ;MUKHACHITRAM MOVIE REVIEW IN TELUGU : ముఖ‌చిత్రం సినిమా రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?

బాలకృష్ణ హీరోగా 1984 లో వచ్చిన మంగమ్మగారి మనవడు ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు.. ఈ మూవీ తర్వాత 1986లో వచ్చిన ముద్దుల కృష్ణయ్య కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయమందుకుంది. 1980లో మువ్వ గోపాలుడు కూడా సూపర్ హిట్ అయ్యి దర్శక నిర్మాతలకు విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టింది.. కానీ ఈ మూడు సినిమాలు తీసింది కూడా ఒకే ఒక దర్శకుడు.. ఆయన దర్శకత్వం అప్పట్లో సెన్సేషనల్ అని చెప్పవచ్చు. ఆయన ఎవరో కాదు కోడి రామకృష్ణ.. ఏకంగా బాలయ్య బాబుతో సినిమాలు తీసి హ్యాట్రిక్ కొట్టాడు..

అంతేకాకుండా దర్శక దిగ్గజం బి.గోపాల్ కూడా ఉన్నారు.. బాలకృష్ణతో 1990లో లారీ డ్రైవర్, ఆ తర్వాత వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్, మరో యాక్షన్ మూవీ సమరసింహారెడ్డి బాలకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.. అప్పట్లో ఈ చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఈ విధంగా బాలయ్య తో సినిమాలు తీసి బి.గోపాల్ కూడా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. వీరితో పాటుగా బాలయ్య కు హ్యాట్రిక్ అందించిన మరో స్టార్ డైరెక్టర్ బోయపాటి.. 2010లో సింహ, 2014లో వచ్చిన లెజెండ్, ఆ తర్వాత అఖండ సినిమాతో హ్యాట్రిక్ సాధించాడు..

ALSO READ;Krishna Simhasanam: మూవీ కోసం 12 కి.మీ క్యూ లైన్ లు కట్టారని మీకు తెలుసా..?

Visitors Are Also Reading