Home » Krishna Simhasanam: మూవీ కోసం 12 కి.మీ క్యూ లైన్ లు కట్టారని మీకు తెలుసా..?

Krishna Simhasanam: మూవీ కోసం 12 కి.మీ క్యూ లైన్ లు కట్టారని మీకు తెలుసా..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఒక ప్రత్యేకమైన రికార్డును సాధించుకున్నారు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కొత్తదనాన్ని పరిచయం చేయాలన్నా ఆయనకే సొంతం అనేది వాస్తవం.. మొదటి కలర్ సినిమా, మొదటి గూఢచారి సినిమా తీసింది కూడా ఆయనే.. ఈ విధంగా కృష్ణ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు సాధించారు..అలాగే ఆయన కెరియర్లో రికార్డు సాధించిన మరో మూవీ సింహాసనం. సింహాసనం చిత్రం అప్పట్లో బాహుబలి సినిమాతో పోల్చవచ్చు..

Advertisement

ALSO READ;చిరుని ఎన్టీఆర్ తొక్కకుండా ఉండేందుకు అల్లు రామలింగయ్య ఏం ప్లాన్ వేశారో తెలుసా ?

1980లో జానపద చిత్రాన్ని తీయాలనే కోరికతో సింహాసనాన్ని ప్రారంభించారు.. కానీ ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ.. 3.50 కోట్ల రూపాయలతో సినిమా తీయాలని అనుకున్నారు.కానీ మూవీ ప్లాప్ అయితే మాత్రం నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కృష్ణ భావించారు. దీంతో పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మించారు.డైరెక్షన్ కూడా ఆయనదే. ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు ప్రతిరోజు మూవీ గురించి అప్డేట్ పేపర్లలో వచ్చేది. దీంతో అప్పట్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ నటి మందాకినితో పాటు జయప్రద,రాధా కూడా నటించారు. రెండు నెలల్లో షూటింగ్ పూర్తి అయింది. అప్పట్లో 50 లక్షల బడ్జెట్ అంటేనే సినిమా పెద్దది.

Advertisement

ఏకంగా ఈ మూవీకి మూడున్నర కోట్లు పెట్టి తెలుగు తో పాటు హిందీలో కూడా చిత్రీకరించారు. హిందీలో జితేంద్ర నటించారు. ఒక సినిమా షూటింగ్ పూర్తయి 1986 మార్చి 21న విడుదలైంది. సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది.. సినిమా టికెట్ కోసం ఏకంగా 12 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉన్నాయి.. మొదటివారం మూవీ 1. 51 కోట్లను గ్రాస్ సాధించగా సింగిల్ థియేటర్లో 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. విశాఖపట్నంలో 100 రోజులు ఆడింది.. మరో రికార్డ్ ఏంటంటే వందరోజుల వేడుకకు ఏకంగా 400 బస్సుల్లో ఫ్యాన్స్ వచ్చి చరిత్ర సృష్టించారు..ఈ విధంగా కృష్ణ సింహాసనం మూవీ రికార్డుల మోత మోగించింది.

ALSO READ;పవన్ కళ్యాణ్ “వారహి”పై ఆంక్షలు.. ఆ ఒక్కటి తీసేయాల్సిందే..?

Visitors Are Also Reading