Telugu News » Blog » ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ గురించి దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు..!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ గురించి దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు..!

by Anji
Ads

ఆస్ట్రేలియాతో జరిగినటువంటి నాలుగు టెస్ట్ ల సీరిస్ ని భారత జట్టు 2-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విజయంలో ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇరువురు కూడా కీలక పాత్ర పోషించారు. వీరు తమ బంతులతో ఆసీస్ ని బెంబేలెత్తించి జట్టుకు పూర్వ విజయాన్ని అందించారు. సిరీస్ లో వీరిద్దరే టాప్ వికెట్ టేకర్లు. అశ్విన్ 25, జడేజా 22 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా అయినప్పటికీ మరో రూపంలో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి చేరుకుంది.  

Advertisement

Also Read :  నార్వే డ్యాన్సర్లతో కోహ్లీ డ్యాన్స్.. అనుష్క ఏం చేసిందంటే ?

జూన్ లో లండన్ లోని ఓవల్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ లో మళ్లీ ఆస్ట్రేలియా-భారత జట్టు తలపడనున్నాయి. డబ్ల్యూటీసీలో తలపడే భారత జట్టుపై తాజాగా టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేసాడు. అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ అయినప్పటికీ తుది జట్టులో అతనికి చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. తుది జట్టు నుంచి అశ్విన్, జడేజాలలో ఒకరిని పక్కన పెట్టాల్సి వస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సిగ్గుపడాల్సిన అవసరమేమి లేదని చెప్పుకొచ్చాడు. 

Advertisement

Also Read :  చిరుది ఎంత గొప్ప మనసంటే..ఆ విలన్ కి 40 లక్షల సాయం చేసి ప్రాణాలు కాపాడారు..!!

WTC Finals 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ షెడ్యూల్ వచ్చేసింది..  మరి ఫైనల్‌లో భారత్ ఉంటుందా..? చూద్దాం రండి.. | ICC announced World Test  Championship 2021 23 final ...

వాస్తవం చెప్పాలంటే.. అశ్విన్, జడేజా ఇద్దరూ ఫిట్ గా ఉన్నారని.. అప్పుడు అక్షర్ పటేల్ కి తుది జట్టులో స్థానం దక్కదు అని పేర్కొన్నాడు. అతని స్థానంలో శార్దూల్ పటేల్ కి చోటు దక్కుతుందన్నారు. అశ్విన్ లేదంటే జడేజాలలో ఒకరినే ఆడించాలని అన్నాడు. గత టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఇద్దరినీ ఆడించి తప్పు చేసిందన్నాడు. ఆ మ్యాచ్ లో వారిద్దరూ పెద్దగా రాణించలేకపోయారని గుర్తు చేశాడు దినేష్ కార్తీక్. అలాంటి పొరపాటు చేయవద్దన్నాడు. దీనిని  పెద్దగా చూడాల్సిన అవరం లేదన్నారు. జడేజాని తీసుకోవడ వల్ల బ్యాటింగ్ కి కూడా పనికొస్తాడని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ మ్యాచ్ లలో అశ్విన్, జడేజా ఇద్దరినీ ఒకే మ్యాచ్ లో చూడటం చాలా అరుదైన విషయం అని గుర్తు చేశాడు కార్తీక్. 

Advertisement

Also Read :  7 సార్లు ఆస్కార్ కు ప్రయత్నించి విఫలమైన స్టార్ హీరో.. ఎవరంటే..?