Telugu News » Blog » చిరుది ఎంత గొప్ప మనసంటే..ఆ విలన్ కి 40 లక్షల సాయం చేసి ప్రాణాలు కాపాడారు..!!

చిరుది ఎంత గొప్ప మనసంటే..ఆ విలన్ కి 40 లక్షల సాయం చేసి ప్రాణాలు కాపాడారు..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on

అప్పట్లో ఈ నటుడు విలన్ పాత్రలు చేస్తే చిన్నపిల్లలైతే ఎంతో భయపడేవారు. విలనిజం పాత్రలో ఎంతగానో మెప్పించే ఆ స్టార్ నటుడు ఎవరో కాదు పొన్నం బలం.. చాలామందికి పొన్నం బలం అంటే తెలియదు కానీ ఈ నటుడి ఫోటో చూస్తే చాలా ఈజీగా గుర్తుపట్టేస్తారు. అలాంటి పొన్నం బలంకు మెగాస్టార్ చిరంజీవి సాయం చేసి ప్రాణాలు కాపాడారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు..

Advertisement

also read:మీ పోస్ట్ చూసి మా అన్నయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు..రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..!

పొన్నం బలం అనారోగ్యానికి గురైనప్పుడు చిరంజీవి 40 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి దేవుడయ్యారని ఎమోషనల్ అయ్యారు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. తెలుగు తమిళ ఇండస్ట్రీలో 90వ దశకంలో స్టార్ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పొన్నం బలం. తెలుగులో కూడా టాప్ హీరోలందరి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. కానీ ఎందుకో హఠాత్తుగా సినిమాల్లోంచి మాయమై చివరికి అనారోగ్యం పాలై అందరికీ కనిపించారు.

Advertisement

also read;జక్కన్న అవార్డుపై విమర్శలు చేసే వారికి చెంపపెట్టు లాంటి న్యూస్..!!

తీవ్ర అనారోగ్యానికి గురైన పొన్నం బలం ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు లేక నాకు ఆరోగ్యం బాగాలేదు ఏమైనా సాయం చేయండి అన్నయ్య అంటూ మెగాస్టార్ చిరంజీవికి మెసేజ్ పెట్టారట. దీనిపై స్పందించిన మెగాస్టార్ తన కిడ్నీ సమస్యకు 40 లక్షల ఖర్చు అయితే డబ్బు సాయం చేసి ఆదుకున్నారని పొన్నం బలం తమిళ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

also read:మీరు అతిగా నిద్ర పోతున్నారా.. అయితే ఈ ప్రమాదంలో పడినట్టే ?