Telugu News » Blog » నార్వే డ్యాన్సర్లతో కోహ్లీ డ్యాన్స్.. అనుష్క ఏం చేసిందంటే ?

నార్వే డ్యాన్సర్లతో కోహ్లీ డ్యాన్స్.. అనుష్క ఏం చేసిందంటే ?

by Anji
Ads

సాధారణంగా టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం అంతా సందడిగా ఉంటుంది. మైదానంలో లేదా బయట ఏదైనా సరే.. అతని ప్రవర్తన మాత్రం ఒకే విధంగా ఉంటుంది. బోర్డర్ గావస్కర్ ట్రోపీ ముగిసిన తరువాత దొరికిన విరామంలో కోహ్లీ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ముంబైలో నార్వే డ్యాన్సర్లతో కలిసి చిందేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

Also Read :  పెద్ద హీరోలు కాబట్టి ఫస్ట్ డే హౌస్ ఫుల్.. ఆ తరువాత !

Advertisement

ముంబైలో క్విక్ స్టైల్ అనే నార్వే డ్యాన్స్ టీమ్ ఓ ప్రోగ్రామ్ నిర్వహించింది. ఇందులో విరాట్ కోహ్లీ సందడి చేశాడు. క్విక్ స్టైల్ బృందంలోని ఓ వ్యక్తి క్రికెట్ బ్యాట్ ని ఎత్తి ఏం చేయాలో ఆలోచిస్తుంటాడు. ఇంతలోనే వైట్ షర్ట్, నల్ల ప్యాంట్ వేసుకున్న కోహ్లీ ఎంట్రీ ఇస్తాడు. ఈ నేపథ్యంలోనే నార్వే బృందం ఇస్క్, సిరియో నేషన్స్ పాటలు పాడుతుండగా కోహ్లీ బ్యాట్ పట్టుకొని మ్యూజిక్ కి తగినట్టు డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను విరాట్ కోహ్లీ ఇన్ స్టాలో షేర్ చేయగా.. పోస్ట్ చేసిన గంటలోనే 5.4లక్షల లైక్ లు, 2 మిలియన్ మంది చూశారు. కోహ్లీ స్టెప్పులను మెచ్చుకుంటూ అతని భార్య అనుష్క శర్మ ఎమోజీలను పోస్ట్ షేర్ చేసింది. 

Also Read :  IPL 2023 : ఐపీఎల్ కు ముందే..KKR కు ఎదురుదెబ్బ

Manam News

అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో కోహ్లీ సెంచరీతో మెరిశాడు. 186 పరుగుల లక్ష్యంతో రాణించిన కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా తరుపున కోహ్లీ, శుభ్ మన్ గిల్ శతకాలు బాదడంతో భారీ స్కోర్ చేసింది. పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్ట్ ల సిరీస్ ని 2-1 తేడాతో  కైవసం చేసుకొని నాలుగోసారి ట్రోపీని అందుకుంది టీమిండియా. మరోవైపు ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది టీమిండియా. 

Advertisement

Also Read :   విరాట్ కోహ్లీకి తీవ్ర అనారోగ్యం… అనుష్క ఎమోషనల్..!