Telugu News » Blog » చెన్నై, ముంబై కోసం మేము టైటిల్ గెలుస్తాం..!

చెన్నై, ముంబై కోసం మేము టైటిల్ గెలుస్తాం..!

by Manohar Reddy Mano
Ads
ఐపీఎల్ 2022 ముగియడానికి ముచ్చటగా ఇంకా మూడు మ్యాచ్లు మాత్రమే మిగిలిఉన్నాయి. అయితే ఇందులో ఒక్క మ్యాచ్ నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ – లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ క్రమంలో ఆ జట్టు స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీ కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు. తాము ఈ ఏడాది టైటిల్ గెలుస్తాం అని.. కేవలం బెంగళూర్ ఫ్యాన్స్ కోసం మాత్రమే కాకుండా చెన్నై, ముంబై జట్ల ఫ్యాన్స్ కోసం కూడా మేము ఈ ఏడాది విజేతలుగా నిలుస్తాం అని అన్నాడు.
అయితే ఈ ఐపీఎల్ లో ఆడిన 14 లీగ్ మ్యాచ్ లలో 8 మ్యాచ్ లలో విజయం సాధించి 16 పాయింట్లతో బెంగళూర్ ప్లే ఆఫ్స్ కు వచ్చింది. అయితే ఈ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకోవడానికి పరోక్షంగా చెన్నై, ముంబై జట్లే కారణం. ఎందుకంటే… బెంగళూర్ కు ప్లే ఆఫ్స్ కు పోటీగా ఢిల్లీ ఉంది. ఆ జట్టు చివరి మ్యాచ్ ముంబైతో ఆడింది. ఇందులో గనక ఢిల్లీ గెలిస్తే బెంగళూర్ ప్లే ఆఫ్స్ కు వచ్చేది కాదు. ఆలాగే అంతక ముందు ఢిల్లీని కూడా చెన్నై 91 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ రెండు మ్యాచ్ లలో ఏ మ్యాచ్ లో నైనా ఢిల్లీ గెలిస్తే ఆ జట్టే 4వ స్థానంలో ప్లే ఆఫ్స్ కు వచ్చేది.
కానీ ఆ రెండు ఢిల్లీని ఓడించడం బెంగళూర్ కు కలిసి వచ్చింది. ఇక నేటి మ్యాచ్ కు ముందు దినేష్ కార్తీక్ మాట్లాడుతూ… ఈ ఏడాది ఐపీఎల్ లో పరిస్థితులు మాకు బాగా అనుకూలించాయి. అందువల్లే గుజరాత్ ను ఓడించి ప్లే ఆఫ్స్ కు ఎదురు చూస్తున్న మేము ఎట్టకేలకు ప్లేఆఫ్స్‌కు చేరాం. అయితే మేము కేవలం బెంగళూర్ ఆర్‌సీబీ ఫ్యాన్స్ కోసం మాత్రమే కాకుండా.. చెన్నై, ముంబై ఫ్యాన్స్ కోసం గెలుస్తాం’అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. ఒకవేళ ఈవాళ జరగనున్న ఎలిమినేటర్ లో బెంగళూర్ ఓడిపోతే ఇంటిదారి పట్టాల్సిందే.