Home » ఆ ముగ్గురు స్టార్ హీరోల అభిమానులకు శుభవార్త చెప్పిన దిల్ రాజు ?

ఆ ముగ్గురు స్టార్ హీరోల అభిమానులకు శుభవార్త చెప్పిన దిల్ రాజు ?

by Anji
Ad

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. నిర్మాతలకు కూడా అభిమానులు ఉంటారనే స్థాయిలో ఉన్న వ్యక్తి దిల్ రాజు. ముఖ్యంగా ఆయన సినిమా అంటేనే చాలు హీరోను, దర్శకుడిని చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకు లైన్ కడతారు. సినీ ఇండస్ట్రీలో అంతలా ఓ బ్రాండ్ క్రియేట్ చేశాడు. చాలా మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత నిర్మాత దిల్ రాజుకే దక్కుతుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నారు. ఇదే సమయంలో ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ అభిమానులకు దిల్ రాజు ఓ శుభవార్త చెప్పారు దిల్ రాజు. 

Also Read :  Chiranjeevi: మెగాస్టార్ కు ఆ ఇద్దరు హీరోయిన్లు అంటే చచ్చేంత ఇష్టమట..!

Advertisement

Dil Raju

ప్రస్తుతం పలు సినిమాల నిర్మాణంలో బిజీగా ఉన్నప్పటికీ.. మరోవైపు కొత్త సినిమాల నిర్మాణ పనుల్లో ఉన్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ మూవీలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా కొరటాల  శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా రానుంది. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నారు. ఈ సినిమాల్లో తమ హీరోలు ఏ రేంజ్ లో ఉంటారా? అని అభిమానులు తెగ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.ఇక ఇలాంటి సమయంలో నిర్మాత దిల్ రాజు మరో ఫెంటాస్టిక్ న్యూస్ చెప్పారు. 

Advertisement

Also Read :  సంతోషం గా ఉండండి…మాజీ భర్త మరణం పై నటి సంచలన పోస్ట్….!

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమా కూడా వస్తుందని, అది కూడా పౌరాణికమని ప్రకటించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు ప్రొడక్షన్ కూడా ఫైనల్  అయిందని తెలిపారు.  అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కూడా మరో సినిమా చేయనున్నట్లు చెప్పారు దిల్ రాజు. పవన్ కల్యాణ్ కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దిల్ రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన  పనులు జరుగుతున్నాయని తెలిపారు.బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు కానీ.. అది సెట్ కావడం లేదు. ఇప్పుడు అంతా సెట్ అయింది. ఇలా ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలతో దిల్ రాజు సినిమా చేయడంతో అభిమానులు సంబురపడుతున్నారు.  

Also Read :  అలనాడు తల్లితో.. ఇప్పుడు కూతురుతో నటిస్తున్న చిరంజీవి..మామూలు క్రేజ్ కాదు..!

Visitors Are Also Reading