Home » ఏ పార్టీలోకి వెళ్లినా ఎంపీగా గెలవగలను : దిల్‌ రాజు

ఏ పార్టీలోకి వెళ్లినా ఎంపీగా గెలవగలను : దిల్‌ రాజు

by Bunty
Ad

 

ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ గెలుపొందింది. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్‌ గెలుపొందింది. డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌లో రెండు ప్యానల్స్‌ నుంచి చెరో ఆరుగురు గెలుపొందారు. ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కూడా దిల్‌రాజుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ ఎన్నికల ముందు దిల్‌ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Dil Raju

ఈ ఎన్నికల పోటీలో ఎలాంటి వివాదాలు లేవని..ఫిల్మ్ ఛాంబర్ ను మరింత బలోపేతం చేసేందుకే మా నిర్మాతలంతా ముందుకు వచ్చారని తెలిపారు. నాలుగు సెక్టార్లకు ఫిల్మ్ ఛాంబరే సుప్రీమని.. ఏ సెక్టార్స్ కు ఆయా సమస్యలున్నాయని వివరించారు. ప్రస్తుతం వ్యాపారంలో ఉన్న వాళ్లందరూ మా ఫ్యానెల్ లో ఉన్నారని.. దిల్ రాజు ఫ్యానెల్ యాక్టివ్ ఫ్యానెల్ అన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమని.. కొవిడ్ తర్వాత సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు.

Advertisement

Advertisement

నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ లో ఒక నిర్ణయం తీసుకోవడానికి సమస్య ఎదురైనప్పుడు గిల్డ్ ఏర్పాటు చేశామని.. యాక్టివ్ గా ఉన్న 21 మంది సభ్యులతో కలిసి గిల్డ్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. మిగతా 80 మంది అసోసియేట్ సభ్యులుగా ఉన్నారు.. గిల్డ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా ఉన్నామని చెప్పారు. ఏ పార్టీలోకి వెళ్లినా ఎంపీగా నేను గెలవగలను అంటూ పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు దిల్‌ రాజు. డబ్బు లేకపోతే నాకు కూడా విలువ లేదు.. ఎంతోమంది పెద్ద నిర్మాతలు మరుగునపడిపోయారన్నారు.

ఇవి కూడా చదవండి

“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

Visitors Are Also Reading