Home » రెబల్ స్టార్ ప్రభాస్ లాగే మరో వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా ? అతను కూడా నటుడే..!

రెబల్ స్టార్ ప్రభాస్ లాగే మరో వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా ? అతను కూడా నటుడే..!

by Anji
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. బాహుబలి సినిమా పాన్ ఇండియా లెవల్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించడంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ తో పాటు మరో రెండు ప్రాజెక్టుల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూసి ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.  

Also Read :  ముకేశ్ అంబానీ ఆ హీరోయిన్ కు బావ అవుతారని మీకు తెలుసా..?

Advertisement

 

ఎందుకంటే సాధారణంగా మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ప్రస్తుతం ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని చూసి అసలు ఎవరు ఈయన ? అచ్చం  ప్రభాస్ మాదిరిగానే ఉన్నాడు అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.  ఈ వ్యక్తి ప్రభాస్ లాగా ఎందుకు ఉన్నాడు అంటూ నెట్టింట్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఆశిష్ కపూర్. ఇతను బాలీవుడ్ కి సంబంధించి సూపర్ హిట్ హిందీ సీరియల్స్ లలో నటించారు. సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాలలో కూడా నటించారు ఆశీష్.  

Advertisement

Also Read :  Mokshagna : బాలయ్య పుత్రుడి ఎంట్రీకి స్క్రిప్ట్ రెడీ….టైటిల్ కూడా ఇదేనట…!

ఒక సినిమాకు నిర్మాత గా కూడా వ్యవహరించారు ఆశీష్. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండే ఆశీష్ కు ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. తన వర్కవుట్ ఫోటోలు, పర్సనల్ ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. ఈ ఫోటోలను చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ కొన్ని యాంగిల్స్ లో ప్రభాస్ లా ఉన్నారు అంటూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం రెబల్ స్టార్ ప్రభాస్ మాదిరిగా ఉన్న ఆశీష్ ని మీరు కూడా లుక్ వేయండి.  

Also Read :  Anushka Shetty: ప్రభాస్ ను ప్రేమగా పిలిచిన అనుష్క….ఫైర్ అవుతున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్..!

Visitors Are Also Reading