Home » Anushka Shetty: ప్రభాస్ ను ప్రేమగా పిలిచిన అనుష్క….ఫైర్ అవుతున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్..!

Anushka Shetty: ప్రభాస్ ను ప్రేమగా పిలిచిన అనుష్క….ఫైర్ అవుతున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్..!

by AJAY
Ad

ప్రభాస్ అనుష్క ల మధ్య ఏదో ఉంది అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను అనుష్క ఖండించారు. దాంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహపూర్వకమైన రిలేషన్ ఉందని అంతా భావిస్తున్నారు. కాగా ఇప్పుడు ప్రభాస్ అనుష్కల మధ్య జరిగిన రొమాంటి* సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement

చాలా కాలం పాటు సినిమాలకు దూరమైన అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ విడుదలయింది. కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కినట్టుగా అర్థం అవుతోంది. ఇక ఈ సినిమా టీజర్ ను చూసిన ప్రభాస్ చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చేశాడు. సినిమా టీజర్ చాలా బాగుందని చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు.

ఇక ప్రభాస్ కు అనుష్క రిప్లై ఇచ్చింది. థాంక్యూ పుప్సూ…. అంటూ అనుష్క ప్రభాస్ ను ప్రేమగా పిలిచింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అనుష్క అలా పిలవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పుప్సు అనే పేరు ప్రభాస్ కు సెట్ అవ్వలేదని ప్రభాస్ ఐకానిక్ పర్సనాలిటీ అని కామెంట్స్ చేస్తున్నారు.

Visitors Are Also Reading