Home » Mokshagna : బాలయ్య పుత్రుడి ఎంట్రీకి స్క్రిప్ట్ రెడీ….టైటిల్ కూడా ఇదేనట…!

Mokshagna : బాలయ్య పుత్రుడి ఎంట్రీకి స్క్రిప్ట్ రెడీ….టైటిల్ కూడా ఇదేనట…!

by AJAY

టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు స్టార్ హీరోల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా వచ్చిన మహేష్ బాబు టాప్ లో ఉన్నాడు. ఇక నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్… అక్కినేని వారసుడు నాగచైతన్య సైతం హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.

mokshagna

mokshagna

ఇక చాలా కాలం నుండి నందమూరి అభిమానులు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మోక్షాజ్ఞ ఎంట్రీ అప్పుడు ఉండబోతుంది…. ఇప్పుడు ఉండబోతుంది అంటూ పలు ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటివరకూ మొక్షాజ్ఞ ఎంట్రీ ఇవ్వలేదు. కానీ గతంలో ఇంటికే పరిమితమైన మోక్షాజ్ఞ ఈ మధ్య మీడియా కంట ఎక్కువగా పడుతున్నాడు.

తండ్రి సినిమాలకు అభిమానులతో కలిసి వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఓ అప్డేట్ సైతం వచ్చింది. జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు ఉంది అయితే ఆ రోజున మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై అప్డేట్ రాబోతుంది అంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 స్క్రిప్ట్ ను మోక్షజ్ఞ కోసం రెడీ చేస్తున్నట్టుగా హింట్ ఇచ్చాడు. దాంతో మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫామ్ అయినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మోక్షాజ్ఞ ఉండబోతున్నారని కూడా ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బోయపాటి సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాలో మోక్షజ్ఞ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారని టాక్. అయితే ఈ వార్తల్లో ఇంతవరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Also read : Anushka Shetty: ప్రభాస్ ను ప్రేమగా పిలిచిన అనుష్క….ఫైర్ అవుతున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్..!

Visitors Are Also Reading