Home » ఆ సినిమాకి రజినీకాంత్ కంటే ఎక్కువగా ఆ హీరోయిన్ పారితోషకం తీసుకుందా ?

ఆ సినిమాకి రజినీకాంత్ కంటే ఎక్కువగా ఆ హీరోయిన్ పారితోషకం తీసుకుందా ?

by Anji
Published: Last Updated on

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత ఏజ్ వచ్చినప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా  రజినీ నటించిన జైలర్ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇక సినిమా ట్రైలర్ చూస్తే.. తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. రజినీకి ఈ సినిమా హిట్  చాలా అవసరం. ఎందుకంటే.. గత కొద్ది సంవత్సరాలుగా సినిమాలు అయితే చేస్తున్నారు. కానీ సక్సెస్ సాధించలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే జైలర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదంతా పక్కనబెడితే ఓ సినిమా కోసం సూపర్ స్టార్ కంటే హీరోయిన్ కే పారితోషకం ఎక్కువ ఇచ్చారు. ఇంతకు ఆమె ఎవరు ? అది ఏ మూవీనో ఇఫ్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా ఏ సినిమా తీసుకున్నా.. దాదాపు హీరోయిన్ కంటే హీరోకే ఎక్కువ పారితోషకం ఎక్కువ ఇస్తుంటారు. సూపర్ స్టార్ రజినీ లాంటి వారు వాళ్లకు అయితే ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగానే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో అంటే.. కె.బాలచందర్  దర్శకత్వంలో.. మూండ్రు ముడిచ్చు  అనే మూవీ చేశారు. అంతకు మూడేళ్ల ముందు తెలుగులో వచ్చిన ఓ సీత మూవీకి ఇది రీమేక్. ఈ సినిమాలో నటించినందుకు రజినీకాంత్ కి కేవలం రూ.2వేలు మాత్రమే ఇఛ్చారట. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవికి మాత్రం రూ.5000 ఇచ్చారు. ప్రధాన పాత్రలో నటించిన కమల్ హాసన్ కి మాత్రం రూ.30వేలు మాత్రమే ఇచ్చారు. అప్పటికే కమల్ ఫేమస్ కావడం వల్ల ఇంత మొత్తం ఇచ్చారని శ్రీదేవి గతంలోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మొత్తానికి ఏది ఏమైనా రజినీకాంత్ కంటే ఎక్కువ శ్రీదేవి డబుల్ రెమ్యూనరేషన్ తీసుకోవడం ఆశ్చర్యపరిచే విషయం కదా.. వీరిద్దరూ కలిసి దాదాపు 18 నటించడం విశేషం. తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ మూవీలో రజినీకాంత్.. రిటైర్డ్ పోలీస్ అధికారిగా నటించారు. కుటుంబంతో కలిసి వాళ్లు చెప్పినట్టు పనులు చేస్తూ ఉండే ఈయన లైఫ్ లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. సౌమ్యంగా ఉండే రజినీ కాస్త యాక్షన్ లోకి దిగుతాడు. చివరికీ ఏమైంది..? అసలు రజినీ రెచ్చిపోవడానికి కారణం ఏంటి ? అనేది జైలర్ మూవీ స్టోరీలా అనిపిస్తుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

క్లీంకారకు చిరంజీవి దంపతులు స్పెషల్ గిప్ట్ అందుకోసమేనా ?

ఆ సినిమాకి రజినీకాంత్ కంటే ఎక్కువగా ఆ హీరోయిన్ పారితోషకం తీసుకుందా ?

Visitors Are Also Reading