యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మధ్య స్నేహం ఇప్పటిది కాదు.. బయటి ప్రపంచానికి వీరిద్దరూ స్టార్ హీరోలు అని మాత్రమే తెలుసు. కానీ అంతకంటే ముందే వీరు మంచి స్నేహితులు. టాలీవుడ్ సినీ చరిత్రలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ హీరోలు తమ సినిమాలతో నువ్వా..? నేనా..? అనేవిధంగా పోటీ పడుతుంటారు. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులుగా ఉంటారు. దాదాపు పదిహేనేళ్ల కిందట రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకే కారులో ప్రయాణించారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అయింది.
Advertisement
అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే అది అనుకున్నట్టుగా RRR మూవీతో వారి కల వాస్తవం అయింది. వీరి సినిమాల పరంగా పోటీ పడుతుంటారు. జయ, అపజయాలను ఎప్పుడు ఎవ్వరినీ వరిస్తాయనే విషయాలను మనం పక్కకు పెడితే ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోల మధ్య మంచి స్నేహం ఉంది. రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య స్నేహం RRR మూవీతో మరింత బలపడింది. ఈ చిత్రంతోనే వీరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులకు తెలిసిపోయింది.
Advertisement
ఇదిలా ఉండగా..తాాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ నుంచి మీరు మీలో ఏ క్వాలిటీ ఉంటే బాగుంటుందని.. దేనిని చూస్తే అనిపిస్తుండని యాంకర్ ప్రశ్నించగా.. దానికి రామ్ చరణ్ సమాధానమిస్తూ.. ఎన్టీఆర్ లో అంతులేని ఎనర్జీ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ అర్థం కాదన్నారు. అంత ఎనర్జీ అయితే తనలో లేదన్నారు రామ్ చరణ్. అవకాశం వస్తే ఎన్టీఆర్ నుంచి ఆ ఎనర్జీని తాను అప్పుగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :