Home » Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నారా? వీరి పెళ్లి ఎందుకు జరగలేదు?

Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నారా? వీరి పెళ్లి ఎందుకు జరగలేదు?

by Srilakshmi Bharathi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. అందులో బాలకృష్ణ తర్వాత హీరోలుగా నిలదొక్కుకున్నవారు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ మాత్రమే. నటన పరంగా ఇద్దరు ది బెస్ట్ ఇచ్చారు. ఇక కళ్యాణ్ రామ్ మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఇండస్ట్రీ లో పేరు తెచ్చుకున్నారు. కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలలో కొన్ని హిట్ అవ్వగా.. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే.. తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు అభిమానుల కొదవ లేదు.

Advertisement

హీరో గానే కాకుండా.. కళ్యాణ్ రామ్ నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నారు. గతేడాది కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన “బిమ్బిసార” సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యింది. విడుదల అయ్యాక బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ `డెవిల్‌` అనే సినిమా చేస్తున్నారు.

Advertisement

కెరీర్ పరంగా దూసుకెళ్తున్న కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో ఓ స్టార్ హీరోయిన్ ను ప్రేమించారట. ఆమె కూడా కళ్యాణ్ రామ్ పై ఇంటరెస్ట్ చూపించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కళ్యాణ్ రామ్ ఆను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే.. తండ్రి హరికృష్ణ అందుకు ఒప్పుకోలేదు. సినిమా హీరోయిన్స్ తో లైఫ్ వద్దు అని చెప్పి బ్రెయిన్ వాష్ చేశారట. ఆ తరువాతే.. కళ్యాణ్ రామ్ కు ఓ సంబంధం కుదిర్చి పెళ్లి చేసేశారని సినీ ఇండస్ట్రీలో టాక్స్ అయితే ఉన్నాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Vastu tips :ఈ మొక్కలు ఇంట్లో ఉంటె వెంటనే తీసేయండి! డబ్బుని అస్సలు రానివ్వవు!

Tulasi mala : ఈ వ్యక్తులు పొరపాటున కూడా తులసి మాల ధరించకూడదు..!

Visitors Are Also Reading