Home » Gandeevadhari Arjuna Movie Review : వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున మూవీతో మళ్లీ అదే రిపీట్ చేశాడా ?

Gandeevadhari Arjuna Movie Review : వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున మూవీతో మళ్లీ అదే రిపీట్ చేశాడా ?

by Anji
Ad

Gandeevadhari Arjuna Movie Review in Telugu : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది వరకు శుక్రవారం వచ్చిందంటే సినిమాల సందడి నెలకొనేది. కానీ ఇప్పుడు ఓటీటీలోకి ఎలాగో వస్తాయని.. మెల్లగా చూడవచ్చని ప్రేక్షకులు థియేటర్ల వద్దకు వెళ్లి వీక్షించడం చాలా తక్కువ అయిందనే చెప్పాలి. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గాంఢీవదారి అర్జున మూవీ ఆగస్టు 25న విడుదల అయింది.  ఈ మూవీ ఎలా ఉంది.. ప్రేక్షకులు ఏమంటున్నారు. వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడ్డట్టేనా ? లేక నెగటివ్ టాక్ వస్తుందా అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

సినిమా : గాంఢీవదారి అర్జున

నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షివైద్య, వినయ్ రాయ్, బర్నాబాస్ రెటి, లీ నికోలస్ హారిస్, వినయ్ నల్లకంది, ఆండ్రినా సాంబుశెట్టి

దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు 

నిర్మాత : బీవీఎన్ఎస్ ప్రసాద్ 

సంగీత దర్శకుడు : మిక్కీ జే మేయర్

సినిమా నిడివి : 2 గంటల 16 నిమిషాలు 

విడుదల తేదీ : ఆగస్టు 25, 2023

కథ మరియు విశ్లేషణ : 

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ( అర్జున్ వర్మ) అనే పాత్రలో నటించారు. ఈ సినిమా ఓ మెడికల్ మాఫియాకి సంబంధించింది. భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ట్రీట్ మెంట్ పేరుతో మాఫియాకి ఎలా తెర లేపారు ? లక్షలాది కోట్ల వ్యాపారంగా ఎలా మారింది. మన చుట్టూ ఉన్న ఆసుపత్రుల్లో ఇంత పెద్ద మాఫియా జరుగుతున్నప్పటికీ మనం తెలుసుకోలేకపోయామనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా వస్తోంది. మెడికల్ మాఫియాను విదేశాల్లో ఉంటూ నడిపిస్తున్న వాళ్లను ఇంటర్ పోల్ ఆఫీసర్ గా పని చేస్తున్న వరుణ్ తేజ్ ఎలా ఆకట్టించాడు అనేది ఈ చిత్రం యొక్క కథ. 

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ( అర్జున్ వర్మ) అనే పాత్రలో నటించారు. ఈ సినిమా ఓ మెడికల్ మాఫియాకి సంబంధించింది. భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ట్రీట్ మెంట్ పేరుతో మాఫియాకి ఎలా తెర లేపారు ? లక్షలాది కోట్ల వ్యాపారంగా ఎలా మారింది. మన చుట్టూ ఉన్న ఆసుపత్రుల్లో ఇంత పెద్ద మాఫియా జరుగుతున్నప్పటికీ మనం తెలుసుకోలేకపోయామనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా వస్తోంది. మెడికల్ మాఫియాను విదేశాల్లో ఉంటూ నడిపిస్తున్న వాళ్లను ఇంటర్ పోల్ ఆఫీసర్ గా పని చేస్తున్న వరుణ్ తేజ్ ఎలా ఆకట్టించాడు అనేది ఈ చిత్రం యొక్క కథ. సాధారణంగా వరుణ్ తేజ్ తీసే ప్రతీ సినిమా కూడా ఓ ప్రయోగమనే చెప్పాలి. ఇటీవలే ఘనీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా ఫ్లాట్ టాక్ సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్ తగినట్టే దర్శకుడు ప్రవీణ్ సత్తారు సైతం ప్రయోగాలకు దిట్ట. ప్రారంభం నుంచి కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తుంటాడు. ఆయన హై అండ్ స్టైలీష్ యాక్షన్ చిత్రాలను తీయడంలో స్పెషలిస్ట్ అయ్యాడు.

Advertisement

 

తాజాగా వీరిద్దరి కాంబోలో గాండీవధారి అర్జున మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ తెరకెక్కించడంలో దర్శకుడు విఫలం చెందినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా పేరు కొంచెం విచిత్రంగా ఉంది. గాండీవధారి అర్జున అనే పేరు అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. కానీ ఈ చిత్రం చూస్తే ఆ పేరు ఈ సినిమాకు ఎందుకు పెట్టారో అర్థమవుతుంది.  వరుణ్ తేజ్ ఇప్పటివరకు తీసిన సినిమాలను పరిశీలించినట్టయితే.. ఆయన సినిమాలో మంచి మెసేజ్ ఉంటుంది. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంది. గాండీవధారి మూవీలో ఓ సోషల్ మెసేజ్ కూడా ఉంది. మన చుట్టూ ఇంత జరుగుతున్నా.. మనం ఈ చిన్న విషయాన్ని ఎందుకు మరిచిపోయాం అని ఈ సినిమా చూసిన తరువాత మనం తప్పకుండా అనుకుంటాం. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. హీరో, హీరోయిన్ మధ్య కెమెస్ట్రీ పర్వాలేదనిపిస్తుంది.  కానీ సినిమా కాస్త స్లోగా సాగుతుంది.  వాతావరణంలో జరిగే మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చే నష్టాలను అద్భుతంగా చూపించారు. కానీ వరుణ్ తేజ్ ఈ మూవీ గత సినిమాల మాదిరిగానే కాస్త నెగటివ్ టాక్ సొంతం చేసుకోవడం గమనార్హం. 

ప్లస్ పాయింట్స్ :

సినిమా స్టోరీ 

వరుణ్ తేజ్ నటన

యాక్షన్ సీన్స్

మంచి మెసేజ్

మైనస్ పాయింట్స్ :

సాగదీత 

దర్శకుడు తెరకెక్కించిన విధానం 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

రేటింగ్ : 2.75/5

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Jailer Review : ‘జైలర్’ మూవీ రివ్యూ..రజినీ దుమ్ములేపాడుగా

ఇరవై ఆరేళ్ల క్రితం ఊహ ఇంటికి వెళ్లి శ్రీకాంత్ అలా చేశారా ?

 National Film Awards 2023 : 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ కంప్లీట్ లిస్ట్ ఇదే..!

Visitors Are Also Reading