Home » శ్రీదేవి కోసం సీనియర్ ఎన్టీఆర్ అంత సాహసం చేశారా ? ఆ దర్శకుడు కూడా..

శ్రీదేవి కోసం సీనియర్ ఎన్టీఆర్ అంత సాహసం చేశారా ? ఆ దర్శకుడు కూడా..

by Anji
Published: Last Updated on
Ad

విశ్వ విఖ్యాత, నటసార్వభౌమ, అన్న నందమూరి తారకరామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా రంగంలో అయితే ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. ఆయన నటించిన పలు పాత్రలతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక, జానపద, సాంఘికంగా ఇలా అన్ని రకాల సినిమాలతో సీనియర్ ఎన్టీఆర్ ఓ ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి. ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసేవారు. 

Also Read :  సరికొత్త హంగులతో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. ఎన్ని కోట్లతో నిర్మిస్తున్నారంటే..?

Advertisement

ఒకనొక సందర్భంలో అయితే దర్శకుడు రాఘవేంద్రరావు ఓ కథ సిద్ధం చేసుకొని ఎన్టీఆర్ తో సినిమా చేశాడు. ఆ చిత్రమే వేటగాడు. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం చాలా రోజుల పాటు చర్చ కొనసాగింది. దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం హీరోయిన్ విషయంలో శ్రీదేవి అనే మాట మినహా మాట మాట్లాడటం లేదు. ఇక నిర్మాతలు మాత్రం శ్రీదేవి వద్దని చెప్పారు. ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి చాలా చిన్న పిల్ల మాదిరిగా ఉంటుందని చెప్పారు. ఇక ఈ విషయం ఎన్టీఆర్ వద్దకు చేరడంతో నిర్మాతలను పిలిచి మాట్లాడారు. సినిమాలలో నటించే వారికి సెంటిమెంట్లు చూడరు అండి.. ప్రేక్షకులు దేవుళ్లు అని చెప్పారు.

Advertisement

Also Read :  నాగబాబు కామెంట్స్ పై తమ్మారెడ్డి ఏమన్నారో తెలుసా ?

ప్రేక్షకులు మాత్రం అన్నీ రిసీవ్ చేసుకుంటారు. వారు అలాంటివి ఏమి పటించుకోరు. మీకు బాధ ఎందుకు.. నాదీ బాధ్యత.. మీకు ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడతానని హామీ ఇచ్చారట ఎన్టీఆర్. కథ బలంగా ఉండాలి కానీ ఇవన్నీ ఎందుకు చెప్పారట. అదేవిధంగా శ్రీదేవిని కూడా స్వయంగా ఎన్టీఆర్ ఒప్పించారట. అలా ఆ జోడీ సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం సూపర్ హిట్ తరువాత వీరి కాంబోలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇవి కూడా బ్లాక్ బస్టర్ సాధించాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనున్న విషయం తెలిసిందే. మరీ వీరి కాంబినేషన్ కూడా వారిలాగే హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి. 

 Also Read :  మీ భర్తలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే వేరే స్త్రీతో ఆ సంబంధం ఉన్నట్టే..!

Visitors Are Also Reading